Telangana: కుటుంబాన్ని బలి తీసుకున్న ఆర్థిక ఇబ్బందులు.. నిన్న భర్త.. నేడు భార్యా పిల్లల బలవన్మరణం..

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Telangana: కుటుంబాన్ని బలి తీసుకున్న ఆర్థిక ఇబ్బందులు.. నిన్న భర్త.. నేడు భార్యా పిల్లల బలవన్మరణం..

Updated on: Dec 03, 2021 | 12:58 PM

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూమిగ్‌ కాలనీలో నివాసం ఉంటున్న 40 ఏళ్ల చంద్రకాంత్ రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తున్నారు. ఆయనకు భార్య లావణ్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇటీవల అతనికి వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయి. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై ఆలుమగల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరి పిల్లలను తీసుకుని లావణ్య ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది.

భార్య పిల్లలతో బయటకు వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన చంద్రకాంత్‌ నిన్న ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త మరణవార్తను తెలుసుకున్న లావణ్య తన ఇద్దరు పిల్లలతో సహా ఆందోళ్‌ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. కాగా లావణ్య తన ఇద్దరు పిల్లలు తప్పిపోయినట్లు గురువారం సాయంత్రం వారి బంధువులు రామంచంద్రపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read:

Crime news: మిరాజ్‌ ఫైటర్‌ జెట్‌ టైరును అపహరించిన దుండగులు.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Telangana: ట్రైనింగ్‌ నర్సుతో అసభ్యకర ప్రవర్తన.. కీచక డాక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

Andhra Pradesh: మద్యం బాటిల్‌లో చెత్తాచెదారం, పురుగులు.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..