మాజీ ఎంపీటీసీని హతమార్చిన మావోలు

భద్రాద్రి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాకి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోలు హతమార్చారు. ఈ నెల 8న శ్రీనివాస్ రావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందునే శ్రీనివాసరావును చంపామని మావోయిస్టులు చెబుతున్నారు. ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య శ్రీనివాసరావు మృతదేహం దొరికింది. మృతదేహం వద్ద చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో లేఖ దొరికింది. శ్రీనివాస్ హత్యతో ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాలలో భయానక పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాస్ టీఆర్‌ఎస్ చెందిన వ్యక్తి […]

మాజీ ఎంపీటీసీని హతమార్చిన మావోలు

Edited By:

Updated on: Jul 12, 2019 | 11:21 PM

భద్రాద్రి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాకి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోలు హతమార్చారు. ఈ నెల 8న శ్రీనివాస్ రావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందునే శ్రీనివాసరావును చంపామని మావోయిస్టులు చెబుతున్నారు. ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య శ్రీనివాసరావు మృతదేహం దొరికింది. మృతదేహం వద్ద చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో లేఖ దొరికింది.

శ్రీనివాస్ హత్యతో ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాలలో భయానక పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాస్ టీఆర్‌ఎస్ చెందిన వ్యక్తి కావడంతో అధికార పార్టీ నేతలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమ అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు.