Couple Murdered: దేశంలో హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దొంగతనానికి వచ్చి హత్యలకు పాల్పడం, పాత కక్షల కారణంగా ఎంతో మంది హత్యలకు గురవుతున్నారు. బెంగళూరు పశ్చిమ శివారులోని ఈగిల్‌టన్ రిస్టార్ట్‌లో విల్లాలో భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ పైలట్, అతని భార్య హత్యకు గురైన ఘటన సంచలనంగా మారింది. ఈ విషయం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు చెన్నైకి చెందిన రఘురాజన్ (70), అతని భార్య ఆశా (63)గా గుర్తించారు పోలీసులు. ఈ దంపతులకు ఇద్దరు కుమారు ఉన్నారు. వీరిద్దరూ ఢిల్లీలోని ఒక ప్రైవేటు సంస్థలు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల వివరాల ప్రకారం.. కుమారులు తల్లిదండ్రులకు ఫోన్ చేయగా, వారు స్పందించకపోవడంతో విల్లా సెక్యూరిటీ గార్డుకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేయాలని కోరారు. సెక్యూరిటీ గార్డు వెళ్లి పరిశీలించగా, వారు రక్తపు మడుగులో పడి ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
రక్తపు మడుగులో దంపతులు
సెక్యూరిటీ గార్డు ఇంటి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దంపతులు కనిపించినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. దంపతులు నిద్రిస్తున్న సమయంలో దుండగులు తలలపై సుత్తితో కొట్టినట్లు గుర్తించారు. సమాచారం అందుకుని విల్లాను పరిశీలించినట్లు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు రామనగర ఎస్పీ సంతోష్‌బాబు తెలిపారు.
విలువైన వస్తువులను దొంగిలించేందుకే ఈ హత్య..
కాగా, ఇంట్లో విలువైన వస్తువులను దొంగిలించేందుకే దుండగులు దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసును ఛేదించడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి: