దైవదర్శనానికి వెళ్లొస్తూ.. అనంతలోకాలకు

| Edited By:

Jul 01, 2019 | 7:55 AM

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేటలోని ఎన్టీఆర్ సెంటర్‌లో జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని బొలేరా వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వాసులుగా గుర్తించారు. తిరుపతి దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. […]

దైవదర్శనానికి వెళ్లొస్తూ.. అనంతలోకాలకు
Follow us on

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేటలోని ఎన్టీఆర్ సెంటర్‌లో జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని బొలేరా వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వాసులుగా గుర్తించారు. తిరుపతి దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.