నోయిడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సుల ఢీ.. 5 మంది మృతి, 30 మందికి గాయాలు

|

Mar 06, 2021 | 5:26 PM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా 30 మంది గాయపడ్డారు.

నోయిడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సుల ఢీ.. 5 మంది మృతి, 30 మందికి గాయాలు
Follow us on

Noida Road Accident : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. నోయిడా జిల్లాలోని లోధ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. హుటాహుటీన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించామని అలీఘర్ జిల్లా కలెక్టర్ చంద్రభూషన్ సింగ్ పేర్కొన్నారు.


ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సుమారు 30 మందికి పైగా గాయలపాలయ్యారు. వారిలో తీవ్రంగా గాయపడిన కొందరిని జవహర్ లాల్ నెహ్రు మెడికల్ కాలేజీకి తరలించినట్లు కలెక్టర్ సింగ్ తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఆయన అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్యం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Read Also… అప్పగింతల్లో ఎక్కి ఎక్కి ఏడ్చిన పెళ్లికూతురుకు గుండెపోటు.. ఒక్కసారిగా పెళ్లింట్లో చావు భాజా.. ఒడిశాలో విషాద ఘటన..