ఒంగోలు గొడుగు పాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తేజస్వి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. క్విస్ కాలేజీ యాజమాన్యం అధిక ఫీజుల కోసం వేధించటం వల్లే తేజస్వి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రుల ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థిని తేజస్వి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం భాద్యత వహించాలంటూ చర్చ్ సెంటర్లో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. క్విస్ కాలేజీని గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు రోడ్డుపై బైఠాయించాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తేజస్వి ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తేజస్వి ఆత్మహత్య వార్త మనసును కలచివేసిందన్నారు. ఫీజు కట్టలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని.. ఫీజురీయబంర్స్మెంట్ ఏమైందని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఖరి వల్లే విద్యార్థిని తేజస్వి ఆత్మహత్య చేసుకుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పేదలను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పవన్ మండిపడ్డారు. ఫీజు బకాయిలు రాలేదు కాబట్టే పరీక్షలకు అనుమతించమని కళాశాలల యాజమాన్యాలు తేల్చి చెబుతుంటే.. పేద విద్యార్థులు, వారి తల్లితండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని పవన్ అన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని.. పేద విద్యార్థుల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించి.. తేజస్విని కుటుంబానికి న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఖరి వల్లే ఇంజినీరింగ్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/0KcDr4D5Ck
— JanaSena Party (@JanaSenaParty) February 6, 2021
Also Read: SUICIDE: హైదరాబాద్‌లో విషాదం.. గాంధీ ఆస్పత్రి వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. పోలీసుల దర్యాప్తు..