మరో ఏనుగు మ‌ృతి…కుళ్లిన స్థితిలో కళేబరం

|

Jun 25, 2020 | 12:11 PM

ఇటీవల కేరళలో పేలుడు పదార్థం తిని ఏనుగు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరికొన్ని ప్రాంతాల్లో వేటగాళ్ల బారిన పడి కూడా ఏనుగులు మరణిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఏనుగు మ‌ృత్యువాత పడింది. బండరాళ్ల మధ్యలో

మరో ఏనుగు మ‌ృతి...కుళ్లిన స్థితిలో కళేబరం
Follow us on

గత కొన్ని రోజులుగా వరుసగా ఏనుగుల మరణాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇటీవల కేరళలో పేలుడు పదార్థం తిని ఏనుగు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరికొన్ని ప్రాంతాల్లో వేటగాళ్ల బారిన పడి కూడా ఏనుగులు మరణిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఏనుగు మ‌ృత్యువాత పడింది. బండరాళ్ల మధ్యలో చనిపోయి కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన ఏనుగును గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగు మరణం కలకలం రేపుతోంది. గంగవరం మండలం కేసిపెంట అటవీ ప్రాంతంలో పశువుల కాపరులకు కుళ్లిపోయిన వాసన రావటంతో అటుగా వెళ్లి చూడగా చనిపోయిన ఏనుగు కనిపించింది. వెంటనే అటవీశాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చనిపోయిన ఏనుగుకి పోస్టుమార్టం నిర్వహించారు. బండరాళ్ల మధ్య పడిపోయి ఉండటంతో కాలు జారిపడిపోయి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కళేబరం కుళ్లిపోవడంతో రెండు మూడు రోజుల క్రితమే అది చనిపోయి ఉంటుందని గుర్తించారు. కాగా, చాలా రోజులుగా ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి.