Crime News: వృద్ధ దంపతుల దారుణ హత్య.. కత్తులతో గొంతు కోసి పరారైన దుండగులు..

Elderly Couple Murder: ఓ ప్లాట్‌లో నివసిస్తున్న వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. పదునైన ఆయుధంతో

Crime News: వృద్ధ దంపతుల దారుణ హత్య.. కత్తులతో గొంతు కోసి పరారైన దుండగులు..
Crime News

Updated on: Nov 03, 2021 | 4:59 PM

Elderly Couple Murder: ఓ ప్లాట్‌లో నివసిస్తున్న వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. పదునైన ఆయుధంతో గొంతు కోసి బుధవారం రాత్రి హత్యచేశారు. ఈ విషాద సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని ఘట్లోడియాలోని రాన్నాపార్క్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితులు వారి ఫ్లాట్‌లోనే విగ‌త‌జీవులుగా ప‌డిఉండ‌టాన్ని చూసి.. పక్కన నివసిస్తున్న వారు పోలీసులకు సమాచారమిచ్చారు. హత్యకు గురైన దంపతుల‌ను ద‌యానంద్ శంభ‌ర్ (90), విజ‌య‌ల‌క్ష్మి శంభ‌ర్ (80)గా గుర్తించారు. సమాచారం అనంతరం రాత్రి 8.30 గంటలకు ఘట్లోడియా పోలీసులు, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ (డిసిబి) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించాయి. ద‌యానంద్ బెడ్‌పై విగ‌త‌జీవిగా ప‌డిఉండ‌గా, ఆయ‌న భార్య కుర్చీలో పడిఉంది. నిందితులు దారుణంగా గొంతుకోసి హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు.

ప‌దునైన ఆయుధంతో వారిపై దాడి జరిగింద‌ని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది దోపిడీ దొంగ‌ల ముఠా ప‌ని అయి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న బీరువా అల్మారా కూడా తెరచి ఉందని.. వస్తువులు చిందరవందరగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Aadhaar: కేంద్రం కీలక నిర్ణయం.. ‘ఆధార్’ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఇకపై భారీ జరిమానా..

Akhilesh Yadav: పాక్ ఐఎస్ఐ నుంచి అఖిలేష్ యాదవ్‌కు ఆర్థిక సాయం.. యూపీ మంత్రి సంచలన ఆరోపణలు