తబ్లీఘీ జమాత్‌ కేసులో 541 మంది విదేశీయులపై ఛార్జ్ షీట్లు

| Edited By:

May 28, 2020 | 8:02 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్కజ్ తబ్లీఘీ జమాత్‌ వ్యవహారం గురించి తెలిసిందే. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో వేల మంది తబ్లీఘీలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో విదేశీయులు కూడా పాల్గొన్నారు. విజిటింగ్ వీసాపై వచ్చి.. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా.. దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో.. వీరంతా నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో తబ్లీఘీ చీఫ్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు […]

తబ్లీఘీ జమాత్‌ కేసులో 541 మంది విదేశీయులపై ఛార్జ్ షీట్లు
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్కజ్ తబ్లీఘీ జమాత్‌ వ్యవహారం గురించి తెలిసిందే. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో వేల మంది తబ్లీఘీలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో విదేశీయులు కూడా పాల్గొన్నారు. విజిటింగ్ వీసాపై వచ్చి.. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా.. దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో.. వీరంతా నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో తబ్లీఘీ చీఫ్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేకాదు వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు.. వారి వీసాలను రద్దు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం 541 మంది విదేశీ తబ్లీఘీలపై చార్జ్‌షీట్లు దాఖలు చేశారు ఢిల్లీ పోలీసులు. వీరిలో 414 మంది ఇండోనేషియన్లు, 85 మంది కిర్జిస్తాన్‌,42 మంది మలేషియాకు చెందిన వారు ఉన్నారు.