సెక్యూరిటీ గార్డ్స్ మధ్య చెలరేగిన వివాదం.. మధ్యలో వచ్చిన వ్యక్తిపై దాడి.. ఆపై ఎం జరిగిందంటే?

|

Dec 13, 2020 | 7:44 AM

సెక్యూరిటీ గార్డ్స్ మధ్య చెలరేగిన వివాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకు వెళ్లింది. దీంతో మధ్యలో వచ్చిన

సెక్యూరిటీ గార్డ్స్ మధ్య చెలరేగిన వివాదం.. మధ్యలో వచ్చిన వ్యక్తిపై దాడి.. ఆపై ఎం జరిగిందంటే?
Follow us on

సెక్యూరిటీ గార్డ్స్ మధ్య చెలరేగిన వివాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకు వెళ్లింది. దీంతో మధ్యలో వచ్చిన ఓ వ్యక్తిని కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఢిల్లీలోని సఫ్ధార్ జంగ్ ప్రాంతంలో కిషన్, రవి అనే ఇద్దరు వ్యక్తులు ఓ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. అయితే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆస్పత్రి యాజమాన్యం వారిద్దరిని విధుల నుంచి తొలగించింది. వారి స్థానంలో ముకేశ్, రాకేశ్ అనే ఇద్దరు కొత్త వ్యక్తులను ఉద్యోగంలోకి తీసుకుంది. దీంతో వారిపై పగ పెంచుకున్న కిషన్, రవిలు ఎలాగైనా ఆ ఇద్దరిపై దాడి చేయాలనుకున్నారు. అయితే ఎప్పటిలాగే ముకేశ్, రాకేశ్ విధులను ముగించుకొని మరో వ్యక్తి నీరజ్‌తో కలిసి ఇంటికి వెళుతున్నారు. మార్గ మధ్యలో కిషన్, రవితో పాటు మరో మైనర్ కలిసి ముకేశ్, రాకేశ్‌లపై దాడికి పాల్పడ్డారు. దీంతో మధ్యలో గొడవ ఆపడానికి వచ్చిన నీరజ్ అనే వ్యక్తిపై కిషన్, రవిలు కత్తితో దాడి చేశారు. దాదాపుగా 22 సార్లు పొడిచారు. దీంతో నీరజ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. ఈ దాడిలో ముకేశ్, రాకేశ్‌లకు కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు.