లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జరీ చేసింది. హఫీజ్‌తోపాటు కశ్మీరీ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వతాలి, అల్తాఫ్ అహ్మద్ షా అలియాస్ ఫుంటూష్, యుఏఈకి చెందిన వ్యాపారవేత్త నావల్ కిషోర్ కపూర్‌పై మనీలాండరింగ్ ఆరోపణల కింద కేసులు నమోదు చేసింది. వీరందరికి నాన్ బెయిలబుల్ వారంట్ జరీ చేసింది ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు. ముంబై మారణహోమానికి సూత్రధారి హఫీజ్ సయీద్. హఫీజ్ సయీద్ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అండతో ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఈడీ పేర్కొంది. హఫీజ్, ఐఎస్‌ఐతోపాటు ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం నుంచి వతాలికి డబ్బులు అందినట్లు ఈడీ ఆరోపించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
జమ్మూ కాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు…సీఆర్‌పీఎఫ్ బలగాలపై అనూహ్యంగా కాల్పులు..