గన్ గురి పెట్టి..నిలువు దోపిడీ చేశారు

|

Jul 01, 2019 | 6:15 PM

నార్త్ ఢిల్లీలో ఇదో దారుణం.. తన అత్తవారింటికి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చిన ఓ కుటుంబాన్ని దొంగలు నిలువు దోపిడీ చేశారు. వరుణ్ బెహల్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో వెళ్లి తిరిగి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. కారు పార్కింగ్ చేయడానికి వెళ్తుండగా… అప్పటికే అక్కడ నక్కి ఉన్న ముగ్గురు దొంగలు అతని తలపై గన్ గురిపెట్టి అతని కుటుంబం వద్ద ఉన్న వస్తువులు, అతని భార్య ఒంటిమీదున్న నగలన్నీ […]

గన్ గురి పెట్టి..నిలువు దోపిడీ చేశారు
Follow us on

నార్త్ ఢిల్లీలో ఇదో దారుణం.. తన అత్తవారింటికి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చిన ఓ కుటుంబాన్ని దొంగలు నిలువు దోపిడీ చేశారు. వరుణ్ బెహల్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో వెళ్లి తిరిగి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. కారు పార్కింగ్ చేయడానికి వెళ్తుండగా… అప్పటికే అక్కడ నక్కి ఉన్న ముగ్గురు దొంగలు అతని తలపై గన్ గురిపెట్టి అతని కుటుంబం వద్ద ఉన్న వస్తువులు, అతని భార్య ఒంటిమీదున్న నగలన్నీ ఇచ్ఛేయాలని బెదిరించారు. కారులో ఉన్న ఇద్దరు పసిపిల్లలను కూడా చూసి..వరుణ్ భార్యనూ హెచ్ఛరించారు. భయపడిన ఆమె తన వస్తువులను ఇవ్వగానే.. మరిన్ని వస్తువులకోసం దొంగలు వెతికి అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. వరుణ్ బెహల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు మొదలుపెట్టే లోగానే దొంగలు పారిపోయారు.