Jagananna Cheyuta : జగనన్న చేయూత డబ్బు ఇవ్వలేదని నిద్రిస్తోన్న అత్త మీద వేడివేడి నూనె పోసిన కోడలు

వైయస్సార్ జగనన్న చేయూత డబ్బులు ఇవ్వనందుకు అత్త పై, కోడలు హత్యాయత్నం చేసింది...

Jagananna Cheyuta : జగనన్న చేయూత డబ్బు ఇవ్వలేదని నిద్రిస్తోన్న అత్త మీద వేడివేడి నూనె పోసిన కోడలు
Muder Attempt

Updated on: Jun 27, 2021 | 11:42 AM

YSR Jagananna Cheyutha scheme money : కృష్ణా జిల్లా గుడివాడలో దారుణం నెలకొంది. వైయస్సార్ జగనన్న చేయూత డబ్బులు ఇవ్వనందుకు అత్త పై, కోడలు హత్యాయత్నం చేసింది. మందపాడులోని తన ఇంట్లో నిద్రిస్తుండగా అత్త చుక్కా లక్ష్మీ పై, వేడి వేడి నూనె పోసింది కోడలు స్వరూప. దీంతో అత్తమ్మ లక్ష్మి ఒళ్లంతా సలసలా కాగిపోయింది.

ఈ క్రమంలో తీవ్ర గాయాల పాలైన చుక్కా లక్ష్మిని చుట్టుపక్కల వాళ్లు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఉదంతానికి సంబంధించి లక్ష్మి కుమారుడు చుక్కా శివ నారాయణ, కోడలు స్వరూపలను అదుపులోకి తీసుకున్న గుడివాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుక్క అరుపులు తెచ్చిన తంటా.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది 

కుక్క అరుపులు తెచ్చిన తంటా.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం చిన్న కోట్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది. కుక్క కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమవడం విశేషం. వివరాల్లోకి వెళితే, స్థానికంగా నివసించే బాల నరసింహులు అనే వ్యక్తి తన పై మరుగుతుందంటూ ఒక పెంపుడు కుక్కని కొట్టాడు. అయితే..

తమ కుక్కని ఎందుకు కొడతావంటూ.. ప్రతీకారంగా నరసింహులు పై కుక్క యజమాని దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో కుక్క యజమాని దాడి చేయడంతో తీవ్ర గాయాలైన నర్సింహులు చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నరసింహులు మృతికి కారణమైన కుక్క యజమానిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

Read also : CPI Narayana : నా సలహా ఏంటంటే.. ‘కొత్తగా పెళ్లైన వాళ్లకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించండి’ : నారాయణ