Fake News Alert : కొండాపూర్ ప్రాంతంలో పోలీస్ సిబ్బందిపై దాడి జరగలేదు.. వైరల్ వీడియోపై పోలీసుల వివరణ

పోలీసుపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో నిజం కాదని..

Fake News Alert : కొండాపూర్ ప్రాంతంలో పోలీస్ సిబ్బందిపై దాడి జరగలేదు.. వైరల్ వీడియోపై పోలీసుల వివరణ
Attack On A Police Personal

Updated on: May 29, 2021 | 3:37 PM

Cyberabad police clarification : కొండాపూర్ ప్రాంతంలో నడిరోడ్డు మీద ఒక పోలీసుపై కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో నిజం కాదని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. సైబరాబాద్ పరిధిలోని కొండాపూర్ ప్రాంతంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదని వివరణ ఇచ్చారు. కొండాపూర్ ప్రాంతంలో పోలీస్ పై దాడి చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రసారమవుతోన్న సదరు వీడియో నిజం కాదన్నారు. పోలీసు సిబ్బందిని కర్రలతో తీవ్రంగా కొట్టినట్టుగా ఎక్కడో జరిగిన ఘటననను కొండాపూర్ ప్రాంతంలో జరిగినట్టుగా.. సోషల్ మీడియాలో ప్రసారమవుతోన్న వార్త నిజం కాదని.. ఇది ఫేక్ న్యూస్ అని సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్ ద్వారా సదరు వీడియోను ఉంచి తెలియజేశారు.

దురుద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపింపజేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

Read also : GST council Meeting : జీఎస్టీ మండలిలో కుదరని ఏకాభిప్రాయం.. పన్ను తగ్గింపు అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు