Chennai: అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. దోహాకు తరలిస్తుండగా..

|

Feb 10, 2021 | 12:11 PM

Customs seize drugs: తమిళనాడు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మంగళవారం నిందితుల నుంచి రూ.5.1కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్..

Chennai: అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. దోహాకు తరలిస్తుండగా..
Follow us on

Customs seize drugs: తమిళనాడు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మంగళవారం నిందితుల నుంచి రూ.5.1కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నిందితులు ఎయిర్ కార్గోలో చెన్నై నుంచి దోహాకు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా.. వేయింగ్ మిషన్ ద్వారా 44 కిలోల మెథాంఫేటమిన్ క్రిస్టల్స్, మాదకద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. 44 కేజీలున్న దీనివిలువ 5.1కోట్లు ఉంటుందని, ఇద్దరిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి డ్రగ్స్‌ను భారీగా పట్టుకున్నారు.

Also Read: