“పాస్‌వర్డ్ చెప్పు.. గేమ్ ఆడుకుని.. ఛార్జింగ్ అయిపోయాక తెచ్చి ఇస్తా”.. బాధితుడితో ఫోన్‌లో దొంగ బాతాఖాని

|

Aug 20, 2021 | 5:59 PM

ఈ మధ్య దొంగలు మరీ క్రేజీగా తయారవుతున్నారు. దొంగతనాలు, చోరీలు చేసేప్పుడు, చేసిన తర్వాత కూడా తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా...

పాస్‌వర్డ్ చెప్పు.. గేమ్ ఆడుకుని.. ఛార్జింగ్ అయిపోయాక తెచ్చి ఇస్తా.. బాధితుడితో ఫోన్‌లో దొంగ బాతాఖాని
Thief Phone Covesation
Follow us on

ఈ మధ్య దొంగలు మరీ క్రేజీగా తయారవుతున్నారు. దొంగతనాలు, చోరీలు చేసేప్పుడు, చేసిన తర్వాత కూడా తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అటువంటి ఘటనే వెలుగుచూసింది.  పటాన్​చెరు ఠాణా పరిధిలోని శాంతినగర్‌ కాలనీలో బాలకృష్ణ అనే వ్యక్తి ఫ్యామిలీతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే గత బుధవారం రాత్రి బాలకృష్ణ మర్చిపోయి ఇంటి తలుపునకు గడియపెట్టకుండా పడుకున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన దొంగలు తలుపులు తెరిచి ఉండటం గమనించారు. ఇద్దరు లోపలికి ప్రవేశించి ఆ ఇంట్లో అణువణువు గాలించారు. కాసుల పేర్లు, కరెన్సీ కట్టులు దొరుకుతాయని వెళ్లిన ఆ దొంగలకు నిరాశే ఎదురైంది. చివరికి దొరికిన నాలుగు సెల్‌ఫోన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చేసేందేం లేక నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు ఆ దొంగలు. తెల్లవారాక ఇంట్లో ఫోన్లు కన్పించకపోవడంతో బాలకృష్ణకు సమ్‌థింగ్ తేడాగా అనిపించింది. దీంతో సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇద్దరు దొంగలు ఇంట్లో తిరగడం ఫుటేజ్‌లో రికార్డయ్యింది. వెంటనే పోగొట్టుకున్న ఒక ఫోన్‌ను కాల్ చేయగా ఓ అపరిచిత వ్యక్తి లేపాడు. అంతేకాదు బాలకృష్ణకు ఊహించని విధంగా అవతలివైపు నుంచి రిప్లై వచ్చింది.

ఇళ్లు బాగుంది. ఇంట్లో బంగారం, డబ్బుకు కొదవ ఉండదని ఆశగా వచ్చాం. బంగారం లేదు, డబ్బు దొరకలేదు. సరే ఎలాగూ వచ్చాము కదా అని అక్కడున్న ఫోన్లు తీసుకెళ్లాము. సర్లే.. ఏం చేస్తాం జరిగింది ఏదో జరిగిపోయింది. నాకు చాలా బోరింగ్‌గా ఉంది. నీ ఫోన్​ పాస్​వర్డ్​ చెప్పు కాసేపు గేమ్ ఆడుకుంటా. ఛార్జింగ్​ అయిపోయిన వెంటనే… పటాన్​ చెరు తీసుకువచ్చి నీ ఫోన్​ నీకు ఇచ్చేస్తా” అని దొంగ నుంచి ఆన్సర్ రావడంతో బాధితుడు కంగుతిన్నాడు. ఎంత మాటిచ్చినా ఎత్తుకెళ్లిన దొంగ.. మళ్లీ సెల్‌ఫోన్లు ఎలా తెచ్చిస్తాడు చెప్పండి. అందుకే  చేసేదేమి లేక బాలకృష్ణ ఆన్​లైన్​లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: యువతిపై పెట్రోల్ దాడి ఘటనపై సీఎం జగన్ ఆరా.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం

AP Weather Alert: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు