డెలీవరీ బాయ్ ముసుగులో ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు ఇంటిని గుల్ల చేసిన ఘటన చండీగఢ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చండీగఢ్‌లోని సెక్టార్ 57 ప్రాంతంలో ఉండే ఓ మహిళ కుటుంబంతో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. కాగా.. గత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. సడెన్‌గా డోర్ బెల్ మోగడంతో.. తలుపు తీసింది. చూస్తే కొరియర్ బాయ్.. ఓ పార్శిల్‌తో ప్రత్యక్ష్యమయ్యాడు. విదేశాల నుంచి పార్శిల్ వచ్చిందని నిధికి కవర్ అందించాడు. అయితే.. ఆ పార్శిల్‌ను ఓపెన్ చేయని కోరి.. వాటర్ కావాలని.. లోపలికి వచ్చాడు. దీంతో.. నిధి ఆ పార్శిల్ ఓపెన్ చేసింది. అందులో ఓ తెల్లటి పదార్థం ఉంది.. దానిని వాసన చూడగానే ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. దీంతో.. డెలీవర్ బాయ్ తన స్నేహితులతో కలిసి ఇళ్లును గుల్ల చేసి ఉడాయించాడు. తేరుకున్న మహిళ.. పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేయగా.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు.