కామారెడ్డిలో జంట హత్యల కలకలం

కామారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి గుమస్తా కాలనీ శివారులో జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు...

కామారెడ్డిలో జంట హత్యల కలకలం

Updated on: Jun 26, 2020 | 11:37 AM

కామారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి గుమస్తా కాలనీ శివారులో జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. వడ్ల సుధాకర్, కోయల లక్ష్మయ్య లను గుర్తు తెలియని వ్యక్తులు బండ రాళ్లతో కొట్టి హతమార్చారు. సుధాకర్ బీడీ కాలనీలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పని చేస్తుండగా, కోయల లక్ష్మయ్య హమాలీగా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత వివాదాలతోనే హత్యలు జరిగి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us