సిద్ధార్ధ కేసులో దర్యాప్తు ముమ్మరం..సీఎఫ్ఓ విచారణ

| Edited By:

Aug 02, 2019 | 11:36 AM

మిస్టరీగా మారిన కేఫ్ కాఫీ డే (సీసీడీ) వ్యవస్థాపకుడు సిద్ధార్థ మ‌ృతిపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. సంచనలం సృష్టించిన ఈ కేసులో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్( సీఎఫ్ఓ)తో పాటు పలువుర్ని ప్రశ్నించనున్నారు. జపాన్‌లోని టోక్యోలో ఉన్న సీఎఫ్ఓ, ఇతర అధికారులకు పోలీసులు ఇప్పటికే ఈ మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది. సిద్ధార వదిలిన లేఖ ప్రకారం అప్పుల కంటే ఆస్తులు అధికంగా ఉన్నప్పటికీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయంలో ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. ఈ కేసు […]

సిద్ధార్ధ కేసులో దర్యాప్తు ముమ్మరం..సీఎఫ్ఓ విచారణ
Follow us on

మిస్టరీగా మారిన కేఫ్ కాఫీ డే (సీసీడీ) వ్యవస్థాపకుడు సిద్ధార్థ మ‌ృతిపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. సంచనలం సృష్టించిన ఈ కేసులో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్( సీఎఫ్ఓ)తో పాటు పలువుర్ని ప్రశ్నించనున్నారు. జపాన్‌లోని టోక్యోలో ఉన్న సీఎఫ్ఓ, ఇతర అధికారులకు పోలీసులు ఇప్పటికే ఈ మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది.

సిద్ధార వదిలిన లేఖ ప్రకారం అప్పుల కంటే ఆస్తులు అధికంగా ఉన్నప్పటికీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయంలో ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. ఈ కేసు ఎన్నో అనుమానాలకు తావిస్తున్న దృష్ట్యా.. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగించాలని పోలీసులు భావిస్తున్నారు. ఐటీ అధికారుల వేధింపులు, నష్టాలతోనే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్టు కంపెనీకి లేఖరాసి సిద్ధార్ధ అదృశ్యమై మరణించారు.