NIA Ambani Residence: అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలుంచిన కారు కేసులో మరో ట్విస్ట్.. ఎన్‌ఐఏ బయటపెట్టిన నిజం ఇదే..

|

Mar 19, 2021 | 1:01 PM

Car Bomb Scare Case: అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలుంచిన కారు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. అంటిల్లాకు...

NIA Ambani Residence: అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలుంచిన కారు కేసులో మరో ట్విస్ట్.. ఎన్‌ఐఏ బయటపెట్టిన నిజం ఇదే..
Nia Mukesh Ambani Residence
Follow us on

NIA Mukesh Ambani Residence: అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలుంచిన కారు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. అంటిల్లాకు సమీపంలో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్న కారును ఉంచడంతో పాటు, మన్ సుఖ్‌ హిరేన్‌ మృతి కేసు సచిన్‌ వాజే చుట్టూనే తిరుగుతోంది. ఈ టోటల్‌ ఎపిసోడ్‌లో పోలీస్‌ అధికారి వాజేదే కీ రోల్‌ అంటోంది ఎన్‌ఐఏ.

ఈ నేపథ్యంలో మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌..ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. వాజే అరెస్ట్‌ తర్వాత జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

హిరేన్‌ది ఆత్మహత్య కాదు..హత్యగానే అనుమానిస్తున్నారు అధికారులు. ఆయన బతికుండగానే నీళ్లలో తోసి చంపినట్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టత కోసం హిరేన్ డయాటమ్ బోన్ శాంపిల్స్‌ను హర్యానాలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించారు. హిరేన్‌కు క్లోరోఫామ్ మత్తుమందును ఇచ్చి…అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక నీళ్లలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ వద్ద మెర్సిడెజ్‌ బెంజ్‌ను గుర్తించిన ఎన్‌ఐఏ..ఆ కారు నుంచి 5 లక్షల రూపాయల మనీ, వాజే కుర్తా పైజామా, డూప్లికేట్‌ నంబర్‌ ప్లేట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ క్రైమ్‌ కథా చిత్రమ్‌లో వాజేదే మాస్టర్‌ మైండ్‌ అనే ఆరోపణలతో..ఈ కేసు దర్యాప్తు ముగిసేవరకు వాజేను సస్పెండ్‌ చేసింది ప్రభుత్వం. ఐతే అసలు వాజేను విధుల్లోకి తీసుకోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది.

ఇవి కూడా చదవండి : ఎటు చూసినా కట్టలకు కట్టల నోట్లు.. గుట్టలకు గుట్టల మనీ.. కమల్‌ హాసన్ పార్టీ ట్రెజరర్ ఇంట్లో దొరికిన డబ్బు..


ఇది కూడా ఔటేనా..! కాదే..! అంపైర్ నిర్ణయం సెటైర్లు..! కళ్లకు గంతలు కట్టుకున్నారా అంటూ సెహ్వాగ్ ట్వీట్..