Crime News: కాలేజీలో కీచక లెక్చరర్.. అబ్బాయిలనూ వదలని వైనం.. చివరికి ఏం జరిగిందంటే..

Crime News: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ కీచక లెక్చరర్.. మగ విద్యార్థులను సైతం వదలకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Crime News: కాలేజీలో కీచక లెక్చరర్.. అబ్బాయిలనూ వదలని వైనం.. చివరికి ఏం జరిగిందంటే..
Arrest

Crime News: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ కీచక లెక్చరర్.. మగ విద్యార్థులను సైతం వదలకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం బయటపడటంతో.. పోలీసులు సదరు లెక్చరర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు చిట లోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న నిరంజన్ పాండాగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థులు, జాజ్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలేజీలో పని చేస్తున్న లెక్చరర్ పాండా.. విద్యార్థులను లైంగికంగా వేధింపులకు గురిచేసేవాడు. తన నివాసానికి రావాలని, తనతో రాత్రులు గడపాలని విద్యార్థులను బలవంతం చేసేవాడు. అతను చెప్పినట్లు వినకపోతే.. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు.

కాగా, లెక్చరర్, విద్యార్థుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారాయి. అయితే, లెక్చరర్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరడంతో ఓ విద్యార్థి జాజ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. కీచక లెక్చరర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 294, 354 బీ, 506 కింద కేసు నమోదు చేశారు. అతని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు.. నిండుకుండలా రిజర్వాయర్లు, చెరువులు..

Assam Floods: అస్సాంను ముంచెత్తుతున్న వరదలు.. తినడానికి తిండి కూడా లేక జనం ఆర్తనాదాలు..

Capricorn: మకర రాశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియన ఆసక్తికరమైన విషయాలు.. మీకోసం..

Click on your DTH Provider to Add TV9 Telugu