Chhattisgarh: గ్రామంపై దాడి చేసిన మావోయిస్టులు.. విద్యార్థిని సహా ఐదుగురి అపహరణ..

|

Nov 08, 2021 | 9:39 AM

Naxals abduct 5 villagers: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సుక్మా జిల్లాలో ఐదుగురిని నక్సలైట్లు అపహరించారు. జిల్లాలోని

Chhattisgarh: గ్రామంపై దాడి చేసిన మావోయిస్టులు.. విద్యార్థిని సహా ఐదుగురి అపహరణ..
Naxals
Follow us on

Naxals abduct 5 villagers: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సుక్మా జిల్లాలో ఐదుగురిని నక్సలైట్లు అపహరించారు. జిల్లాలోని కొన్టా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బటెర్‌ గ్రామంపై మావోయిస్టులు శనివారం సాయంత్రం దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐదుగురు గ్రామస్తులను తమవెంట బలవంతంగా తీసుకెళ్లినట్లు సుక్మా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. వారిలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఉన్నట్లు తెలిపారు. కాగా.. గ్రామంపై ఎందుకు దాడి చేశారు.. బాధితులను ఎందుకు తీసుకెళ్లారనే విషయం ఇంకా తెలియలేదని ఎస్పీ సునీల్‌ శర్మ వెల్లడించారు. వారికోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారని తెలిపారు.

సమావేశాల సందర్భంగా మావోయిస్టులు గ్రామస్తులను తీసుకెళ్తుంటారని.. అదేకారణంతోనే తీసుకెళ్లి ఉండవచ్చని ఆయన తెలిపారు. ఎత్తుకెళ్లినవారిని విడుదల చేయాలని బస్తర్‌ రీజియన్‌లోని గిరిజన సంఘాలు ఇప్పటికే మావోయిస్టులను కోరాయని తెలిపారు. భద్రతా దళాలు కూడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. కొంటా పోలీస్ స్టేషన్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందని ఆయన చెప్పారు.

జూలైలో నెలలో జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందేడ్ నుంచి ఎనిమిది మంది గ్రామస్థులను నక్సల్స్ అపహరించి తీసుకెళ్లారని తెలిపారు. అనంతరం రెండు మూడు రోజుల తర్వాత విడుదల చేశారని శర్మ తెలిపారు.

Also Read:

Crime News: గొడవ అవుతుందని వెళితే.. పోలీస్ అధికారినే చితకబాదారు.. తాళ్లతో కట్టేసి దారుణంగా..

Earthquake: భూకంపంతో ఉలిక్కిపడ్డ అండమాన్‌ వాసులు.. ఇళ్ల నుంచి పరుగులు..