Viral: అతడు లాయర్.. మెడికోను ప్రేమిస్తే హ్యాండిచ్చింది.. దీంతో వైద్య విద్యార్థులు అందర్నీ టార్గెట్ పెట్టి

|

Apr 11, 2022 | 9:49 PM

అతడు లా కంప్లీట్ చేశాడు.. ప్రజంట్ బీఏ(ఎకనామిక్స్​) చదువుతున్నాడు. స్టడీస్‌లో మంచి మెరిట్. ఈ క్రమంలోనే ఓ మెడికోతో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమె మధ్యలోనే హ్యాండిచ్చింది. ఆ తర్వాత....

Viral: అతడు లాయర్.. మెడికోను ప్రేమిస్తే హ్యాండిచ్చింది.. దీంతో వైద్య విద్యార్థులు అందర్నీ టార్గెట్ పెట్టి
Laptop Thief
Follow us on

Chennai news: అతడు లా కంప్లీట్ చేశాడు.. ప్రజంట్ బీఏ(ఎకనామిక్స్​) చదువుతున్నాడు. స్టడీస్‌లో మంచి మెరిట్. ఈ క్రమంలోనే ఓ మెడికోతో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమె మధ్యలోనే హ్యాండిచ్చింది. ఆ తర్వాత అతడి లైఫ్ ఊహించని టర్న్ తీసుకుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి. చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజ్‌లో రుద్రేశ్ అనే స్టూడెంట్ చదువుకుంటున్నాడు. ఇటీవల కాలేజ్‌లోనే అతడి ల్యాప్​టాప్ మిస్సయ్యింది. ఎంత వెతికినా దొరకలేదు. దీంతో వన్నారపెట్టై పోలీస్ స్టేషన్​లో రుద్రేశ్​ కేసు పెట్టాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. కాలేజ్ ఆవరణలోని సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. ఓ బయట వ్యక్తి లోపలికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై అతడే దొంగని నిర్థారించుకున్నారు. వెంటనే ఒక టీమ్‌ని ఏర్పాటు చేసి.. కాలేజ్‌లో గస్తీ పెంచారు. గత శనివారం కూడా పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అదుపులో ఉంచుకున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. దొంగ అతడే అని కన్ఫామ్ చేసుకుని.. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో ఆ దొంగ దిమ్మతిరిగే విషయాలు తెలిపాడు. నిందితుడి పేరు తమిళ్​సెల్వన్​. అతను తిరువారూర్​కు చెందినవాడు.  డిస్టెన్స్‌లో లా కంప్లీట్ చేసి.. ప్రజంట్ యూనివర్సిటీ ఆఫ్​ ఢిల్లీలో బీఏ(ఎకనామిక్స్​) చదువుతున్నాడు. కొన్నేళ్లుగా ఓ మెడికోను ప్రేమించాడు. మొదట్లో బాగానే ఉన్న ఆ యువతి.. ఆ తర్వాత హ్యాండిచ్చింది. దీంతో మెడికోలు అందరిపైనా.. కోపం పెంచుకున్నాడు. వాళ్లను ఇబ్బంది పెట్టాలని డిసైడయ్యాడు.

వైద్య విద్యార్థులకు చెందిన ల్యాప్​టాప్​లు రోజూ 2 కాజేయాలని డిసైడయ్యాడు. ఏ రోజు ఏ కాలేజ్‌కు వెళ్లాలో ముందే ఓ టైమ్​ టేబుల్ కూడా ప్రిపేర్ చేశాడు. అలా చోరీ చేసిన  ల్యాప్​టాప్​లు ఓ ఆన్​లైన్​ వెబ్​సైట్​ ద్వారా అమ్మేస్తున్నాడు. విచారణ అనంతరం చెమ్మన్​చేరిలోని సెల్వన్​ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అప్పటికే చోరీ చేసి, అమ్మడానికి  సిద్ధంగా ఉంచని 31 ల్యాప్​టాప్​లను స్వాధీనం చేసుకున్నారు. ఏ రోజు ఏ కాలేజీకి వెళ్లాలని విషయాన్ని ఇంట్లో ఉన్న క్యాలెండర్​లో రాసిపెట్టుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

Also Read: ఛాలెంజ్​ పేరుతో పైత్యం.. ఫ్రూట్ ​జ్యూస్​లో వయాగ్రా పిల్స్ వేసి తాగిన నైన్త్ స్టూడెంట్స్​.. చివరకు