మొత్తానికి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి తిక్క కుదిరింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. ఎలా ఉంటుందో.. మరోమారు రుజువైంది. మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు.. స్వయం కేంద్ర హోంశాఖనే వెల్లడించింది. తనని మోసం చేశాడని మహేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన భావనకు తగిన న్యాయం చేకూరింది.
ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డి తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది భావన. అయితే.. అప్పుడు ఎవరూ సరిగా రెస్పాండ్ అవ్వకపోవడంతో.. కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది భావన. ఏడాదిన్నర క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కీసర రిజిస్ట్రార్ ఆఫీసర్‌లో పెళ్లి చేసుకున్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. ఐపీఎస్‌కి సెలక్ట్ అయ్యాక తనను మోసం చేసి.. వేరే పెళ్లికి సిద్ధమవుతున్నాడని.. గతంలో భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఎక్కువ కట్నాకి ఆశపడి.. తనను విడాకులు ఇవ్వాలంటూ మహేష్, అతని కుటుంబసభ్యులు బెదిరింపులకు దిగినట్టు పేర్కొంది.