Viral Video: ప్రమాదాలు ఎప్పుడు ఎలా.. ఎటు నుంచి వస్తాయో చెప్పలేం.. మనం నిత్యం ఎన్నో భయంకరమైన రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం.. కొన్ని ఒళ్ళు గగ్గుర్పొడిచే రోడ్డు ప్రమాదాలు చూస్తే మన వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా అలాంటిదే.. వేగం వద్దు ప్రాణం ముద్దు.. నిదానమే ప్రధానం అంటూ నిత్యం ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నా కొందరు అతివేగంతో ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. రోడ్డులు ఖాళీగా ఉన్నా… లేకున్నా.. కొందరు ఆకతాయిలు వేగంతో ప్రాణాలు తీస్తున్నారు. ఈ ప్రమాదం చూస్తే గుండెలు అదురుతాయి.. రోడ్డు ప్రక్కన ఆగిఉన్న కారును అతివేగంగా వచ్చిన మరొక కారు వెనకనుంచి వేగంగా ఢీ కొట్టింది.
రోడ్డు ప్రక్కన కారును ఆపి .. తమ కుటుంబ సభ్యులను కారులో ఎక్కించుకుంటున్న సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన కారును ఈ కారును ఢీ కొట్టింది.. క్షణకాలంలో ఈప్రమాదం జరిగిపోయింది. ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదం హరియానాలో జరిగింది. ప్రమాద సమయంలో కారులో 5 గురు ఉన్నారని తెలుస్తుంది. నిర్లక్ష్యం గా కారు నడపడంతో అక్కడ కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :