YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. హార్డ్ డిస్క్‌లు, డాక్యుమెంట్లు పరిశీలన!

|

Jun 08, 2021 | 9:36 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. కొంత కాలం విరామం తర్వాత సోమవారం నుంచి మళ్లీ విచారణ మొదలైంది.

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. హార్డ్ డిస్క్‌లు, డాక్యుమెంట్లు పరిశీలన!
Cbi Speeds Up Investigation On Ys Vivekananda Reddy Case
Follow us on

YS Vivekananda Reddy Murder Case: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. కొంత కాలం విరామం తర్వాత సోమవారం నుంచి మళ్లీ విచారణ మొదలైంది. ఇందులోభాగంగా.. రెండవ రోజు ఇవాళ కూడా విచారణ జరుగుతోంది. కడప జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ జైల్‌లో ఉన్న గెస్ట్‌ హౌస్‌లో ఈ విచారణ జరుగుతోంది.

మొదటి రోజు విచారణలో భాగంగా వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్‌ దస్తగిరిని ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు దాదాపు 7 గంటల పాటు విచారించారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. ఆ తర్వాత డ్రైవర్‌ను పులివెందులకు తీసుకెళ్లారు. అక్కడ కూడా పలు విషయాలపై విచారణ జరిపారు.

ఆ తర్వాత ఇవాళ కూడా డ్రైవర్‌ను మరో సారి విచారిస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. అటు, ఈ కేసుకు సబంధం ఉన్న కొంత మంది అనుమానితులను కూడా సీబీఐ అధికారులు విచారించే ఛాన్స్‌ ఉంది. ఇప్పటికే వివేకా కుమార్తే సునీత.. కేసు విచారణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణను వేగవంతం చేయాలని కోరారు.

అయితే, గతంలో కూడా ఢిల్లీలో 30 రోజులపాటు సీబీఐ అధికారులు డ్రైవర్ దస్తగిరిని విచారించారు. మళ్ళీ నిన్న సీబీఐ అధికారులు విచారణకి రమ్మని మరోసారి క్వశ్చన్ చేశారు. ఇవాళ దస్తగిరితోపాటు కేసుకు సంబంధించి మరికొంతమంది అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. వివేక కుమార్తె సునీత వివేకా కేస్ ఆలస్యం అవుతుందని చెప్పినప్పటి నుంచి సీబీఐ అధికారులు దూకుడుగానే విచారణ చేపడుతున్నారు. కీలక హార్డ్‌ డిస్క్‌లు, డాక్యుమెంట్లును కూడా పరిశీలిస్తున్నారు.

Read Also….  Jagan letter to Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే..!