AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hathras Incident : హాథ్రాస్‌ ఘటనలో కీలక మలుపు.. చివరికి వారి ఆరోపణలే నిజమయ్యాయి..

హాథ్రాస్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఘటన జరిగి మూడు నెలలు గడిచిన తరువాత అసలు విషయం తేలింది.

Hathras Incident : హాథ్రాస్‌ ఘటనలో కీలక మలుపు.. చివరికి వారి ఆరోపణలే నిజమయ్యాయి..
Shiva Prajapati
|

Updated on: Dec 19, 2020 | 2:14 PM

Share

హాథ్రాస్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఘటన జరిగి మూడు నెలలు గడిచిన తరువాత అసలు విషయం తేలింది. బాధితురాలి తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలే నిజమని ఎట్టకేలకు తేలాయి. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన దళిత యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీబీఐ తేల్చింది. ఆ మేరకు నిందితులైన లవకుశ్, రాము, సందీప్, రవిపై అత్యాచారం, హత్య అభియోగాలను మోపుతూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీన దళిత యువతిపై ఈ నలుగురు నిందితులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

యువతిని తీవ్రంగా గాయపరిచారు. దాంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధిత యువతిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు పెల్లుబుకాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగాయి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు బాధిత యువతి మృతదేహానికి గట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి దాటిని తరువాత.. యువతి కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా దహన సంస్కారాలు చేశారు. అయితే ఈ ఘటనలో పోలీసుల తీరుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెలుబుకాయి. దీంతో యోగి సర్కార్ ఈ ఘటనపై విచారణకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి. మూడు నెలలపాటు విచారణ చేపట్టిన సీబీఐ ఎట్టకేలకు అత్యాచారం నిజమే అని తేల్చింది.

Also read:

టీడీపీ నేతలు, ఏపీ పోలీసుల మధ్య ట్విటర్ వార్.. ఫోటో ట్వీట్ చేసిన చంద్రబాబు.. పచ్చి అబద్దం అంటూ కొట్టిపారేసిన పోలీసులు..

కోల్‌క‌త్తాలో భారీ అగ్ని ప్ర‌మాదం.. కిరోసిన్ డ‌బ్బాలు అంటుకుని ఎగిసిప‌డ్డ మంట‌లు.. ముగ్గురు స‌జీవ‌ద‌హ‌నం

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!