Caste Panchayat: రెండో పెళ్లి చేసుకున్నందుకు శిక్షగా మహిళపై ఉమ్మి వేస్తామన్న కుల పెద్దలు..పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు!

|

May 14, 2021 | 5:12 PM

Caste Panchayat: ప్రపంచం ఎంత ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా.. కొంతమంది మాత్రం ఇప్పటికీ తిరోగమనంలోనే ఉన్నారు. మహిళలను వేధించే విషయంలో కొన్ని సమూహాలు ఇప్పటికీ అసహ్యకరంగా ప్రవర్తిస్తూనే వస్తున్నాయి.

Caste Panchayat: రెండో పెళ్లి చేసుకున్నందుకు శిక్షగా మహిళపై ఉమ్మి వేస్తామన్న కుల పెద్దలు..పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు!
Panchayat
Follow us on

Caste Panchayat: ప్రపంచం ఎంత ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా.. కొంతమంది మాత్రం ఇప్పటికీ తిరోగమనంలోనే ఉన్నారు. మహిళలను వేధించే విషయంలో కొన్ని సమూహాలు ఇప్పటికీ అసహ్యకరంగా ప్రవర్తిస్తూనే వస్తున్నాయి. పురుషులకు ఒక న్యాయం.. స్త్రీలకు ఒక న్యాయం. కులం కట్టుబాట్ల పేరుతో మహిళలను కించపరిచి అవమాన పరుస్తున్న సంఘటనలు ఇప్పటికీ చోటుచేసుసుకుంటూ ఉండటం విషాదం. తాజాగా మహారాష్ట్రలో రెండో పెళ్లి చేసుకున్నందుకు ఒక స్త్రీ పై నలుగురూ ఉమ్మేయాలని తీర్పు చెప్పారు ఆమె కులపెద్దలు. అంతేకాదు లక్షరూపాయలు కుల సంఘానికి జరిమానాగా కట్టమన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా ఉన్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

విడాకుల తరువాత రెండవ సారి వివాహం చేసుకున్న 35 ఏళ్ల మహిళకు శిక్షగా, మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఆమె పై ఉమ్మివేయమని ఆమె వర్గానికి చెందిన ‘కుల పంచాయతీ’ ఆదేశించింది. ఈ విషయాన్ని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. అదేవిధంగా కుల పంచాయతీ ఆ పనికి పాల్పడినందుకు గానూ.. ఆ మహిళను కుల సంఘానికి లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. గత నెలలో ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఆ స్త్రీ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

జల్గావ్ జిల్లాలో ఉంటున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు, మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సోషల్ బాయ్‌కాట్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) చట్టం, 2016 లోని 5, 6 సెక్షన్ల కింద జల్గావ్ లోని చోప్డా నగర పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడినందుకు గానూ కుల పంచాయతీలోని పది మంది సభ్యులపై నమోదు చేసినట్లు పోలీసు అధికారి చెప్పారు. ఆ మహిళ ఈ పోలీసు స్టేషన్ అధికార పరిధిలో ఉండటంతో కేసు అక్కడ నమోదు చేసి, తరువాత దానిని అకోలాలోని పింజార్ పోలీస్ స్టేషన్ కు దర్యాప్తు కోసం బదిలీ చేశారు.

ఫిర్యాదు ప్రకారం, ఈ సంఘటన ఏప్రిల్ 9 న అకోలాలోని వాడ్గావ్ గ్రామంలో జరిగింది, బాధితురాలి రెండవ వివాహంపై నిర్ణయం తీసుకోవడానికి కుల పంచాయతీకి పిలిచారు. బాధితురాలు ‘నాథ్ జోగి’ వర్గానికి చెందినది, ఆమె కుల పంచాయతీ తన రెండవ వివాహాన్ని అంగీకరించలేదు. బాధితురాలు 2015 లో తన మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న తరువాత 2019 లో రెండవసారి వివాహం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఆమె మొదటి వివాహం 2011 లో జరిగింది. కుల పంచాయతీ సమావేశంలో, సభ్యులు ఆ మహిళ రెండవ వివాహం గురించి చర్చించారు. ఈ పంచాయతీకి ఆమె సోదరి, ఇతర బంధువులను పిలిచారు. తరువాత ఈ విషయంపై వారి “తీర్పు” ఇచ్చారు. బాధితురాలు అక్కడ జరిగిన పంచాయతీకి హాజరు కాలేదని ఆ అధికారి తెలిపారు.

తీర్పు ప్రకారం, కుల పంచాయతీ(Caste Panchayat) సభ్యులు అరటి ఆకులపై ఉమ్మివేయాలని, బాధితురాలు ఆ ఉమ్మిని శిక్షగా చేతులతో నొక్కి పట్టుకోవాలి. అంతేకాకుండా, కుల పంచాయతీ బాధితురాలి ని లక్ష రూపాయలు చెల్లించాలని కోరింది. పంచాయతీ ఈ డిమాండ్లను నెరవేర్చిన తరువాత, బాధితురాలు తన సంఘానికి “తిరిగి” రావచ్చని చెప్పినట్లు.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసు అధికారి చెప్పారు.

కుల పంచాయతీ నిర్ణయాన్ని బాధితురాలికి ఆమె బంధువులు తెలియజేశారు. ఈ నిర్ణయంతో షాక్ అయిన బాధితురాలు చోప్డా నగర పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పంచాయతీ సభ్యులపై ఫిర్యాదు చేసినట్లు జల్గావ్ పోలీసు సూపరింటెండెంట్ ప్రవీణ్ ముండే తెలిపారు. ఈ సంఘటన అకోలాలో జరిగినందున, కేసును తదుపరి విచారణ కోసం అక్కడికి బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.

Also Read: Baby Sold For Car: ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోన్న మాన‌వ‌త్వం… కారు కొన‌డానికి క‌న్న బిడ్డ‌ను అమ్ముకున్న జంట‌..

కల్లు కంపౌండ్ మహిళలే అతడి టార్గెట్..! ఇప్పటి వరకు 19 మంది మహిళలపై అత్యాచారం, దోపిడీ..