Hyderabad: ట్రాన్స్‌జెండర్ల నిర్వాకం.. అడ్డగించి మరీ డబ్బులు లాక్కున్నారు.. అర్ధరాత్రి ఇదేంటని ప్రశ్నించినందుకు..

|

May 21, 2022 | 12:15 PM

ఇద్దరు ట్రాన్స్ జెండర్లు.. ఓ యువకుడిని అడ్డగించారు. డబ్బులివ్వాలంటూ ఆయన్ను డిమాండ్ చేశారు.. ఈ క్రమంలో అతను మాట్లాడుతుండగా.. ఆయన జేబులో ఉన్న రూ. 500లు లాక్కున్నారు.

Hyderabad: ట్రాన్స్‌జెండర్ల నిర్వాకం.. అడ్డగించి మరీ డబ్బులు లాక్కున్నారు.. అర్ధరాత్రి ఇదేంటని ప్రశ్నించినందుకు..
Crime News
Follow us on

Hyderabad Police: ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అంతకుముందు హైదరాబాద్ పరిధిలో జరిగిన పలు ఘటనల్లో ట్రాన్స్ జెండర్లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా.. ట్రాన్స్ జెండర్లు మరోసారి హద్దులు దాటారు. ఓ వ్యక్తి జేడులో డబ్బులు గుంజుకోవడమే కాకుండా.. అతన్ని కొట్టారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఇద్దరు ట్రాన్స్ జెండర్లపై కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత మదీనా వద్ద నివసించే సయ్యద్‌ షాబాజ్‌ కృష్ణానగర్‌ వైపు నుంచి ఇందిరానగర్‌ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు అడ్డగించారు. డబ్బులివ్వాలంటూ ఆయన్ను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అతను మాట్లాడుతుండగా.. ఆయన జేబులో ఉన్న రూ. 500లు లాక్కున్నారు.

వెంటనే.. ఇదేంటంటూ యువకుడు ప్రశ్నించడంతో వారి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకొని వెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఈ సమయంలో ఓ ట్రాన్స్ జెండర్ రాయితో కొట్టడంతో షాబాజ్‌కు గాయాలయ్యాయి. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..