హైదరాబాద్ మలక్ పేటలో కారు బీభత్సం.. టీకొట్టులోకి దూసుకెళ్ళిన వాహనం.. తీవ్రగాయాలపాలైన సెక్యూరిటీ..

హైదరాబాద్‏లోని మలక్ పేటలో మంగళవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న డీమార్ట్ వద్ద కారు రివర్స్ తీసుకునే క్రమంలో సమీపంలోని టీకొట్టులోకి దూసుకెళ్ళింది.

హైదరాబాద్ మలక్ పేటలో కారు బీభత్సం.. టీకొట్టులోకి దూసుకెళ్ళిన వాహనం.. తీవ్రగాయాలపాలైన సెక్యూరిటీ..

Updated on: Dec 15, 2020 | 4:01 PM

హైదరాబాద్‏లోని మలక్ పేటలో మంగళవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న డీమార్ట్ వద్ద కారు రివర్స్ తీసుకునే క్రమంలో సమీపంలోని టీకొట్టులోకి దూసుకెళ్ళింది. అసిస్టెంట్ ప్రొఫెసర్‏గా పనిచేస్తున్న బాపురాజు అనే వ్యక్తి మలక్ పేట డీమార్టులో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు మంగళవారం తన కారులో వచ్చాడు. సరుకులు తీసుకున్న తర్వాత పార్కింగ్‏లో ఉన్న తన కారును రివర్స్ తీయడానికి ప్రయత్నించగా.. ఒక్కసారిగా కారు పక్కనే ఉన్న టీకొట్టులోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ ఇంఛార్జ్‏కి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారు డ్రైవర్‏ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని పోలీసు దర్యాప్తు చేపట్టారు.