Warangal: కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో టీచర్ సహా మరొకరి మృతి.. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు

|

Feb 10, 2021 | 1:49 PM

parvathagiri warangal: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో బుధవారం ప్రమాదవశాత్తు కారు ఎస్సారెస్పీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు...

Warangal: కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో టీచర్ సహా మరొకరి మృతి.. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు
Follow us on

parvathagiri warangal: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో బుధవారం ప్రమాదవశాత్తు కారు ఎస్సారెస్పీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది.  ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరోకరు నీటిలో గల్లంతయ్యారు. వివరాల ప్రకారం.. వరంగల్‌లోని వినాయక ట్రేడర్స్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది శ్రీధర్‌(38), విజయ్‌ భాస్కర్‌, రాకేశ్‌ పర్వతగిరి నుంచి తొర్రూరు వైపు కారులో వెళుతున్నారు. ఈ క్రమంలో తీగరాజుపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద గుంటూరు పల్లి ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న సరస్వతి (42) లిఫ్ట్‌ అడిగి కారు ఎక్కారు. అక్కడి నుంచి కొంకపాక వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సరస్వతి (42), శ్రీధర్‌ (38) మృతి చెందారు. నీటిలో కొట్టుకుపోతున్న విజయ్ భాస్కర్‌ను స్థానికులు కాపాడారు. అయితే రాకేశ్‌ అనే వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. రాకేశ్‌ది మండలంలోని ఏనుగల్లు గ్రామమని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయినట్లు స్థానికులు వెల్లడించారు. ఇదిలాఉంటే.. సంఘటనా స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మ‌ృతిచెందిన వారి కుటుంబసభ్యులకు మంత్రి సంతాపం తెలిపారు.

Also Read: