Loan Apps: ప్రాణం తీసిన మాయదారి లోన్‌ యాప్‌.. అలా చేయడంతో తట్టుకోలేని బీటెక్‌ విద్యార్థి..

|

Sep 17, 2022 | 3:43 PM

Loan Apps: ఎలాంటి పేపర్ వర్క్‌ ఉండదు, సిబిల్‌ స్కోర్‌ అవసరం లేదు, అసలు ఫిజికల్‌గా కావాల్సిన అవసరమే ఉండదు.. కేవలం స్మార్ట్‌ఫోన్‌లో ఓ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు పదంటే పది నిమిషాల్లో అకౌంట్‌లోకి డబ్బులు వచ్చి పడతాయి. అయితే...

Loan Apps: ప్రాణం తీసిన మాయదారి లోన్‌ యాప్‌.. అలా చేయడంతో తట్టుకోలేని బీటెక్‌ విద్యార్థి..
Loan Apps
Follow us on

Loan Apps: ఎలాంటి పేపర్ వర్క్‌ ఉండదు, సిబిల్‌ స్కోర్‌ అవసరం లేదు, అసలు ఫిజికల్‌గా కావాల్సిన అవసరమే ఉండదు.. కేవలం స్మార్ట్‌ఫోన్‌లో ఓ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు పదంటే పది నిమిషాల్లో అకౌంట్‌లోకి డబ్బులు వచ్చి పడతాయి. అయితే తిరిగి చెల్లించే సమయంలో నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తారు. ఇదీ మాయదారి లోన్‌ యాప్‌ల గలీజ్‌ దందా. వడ్డీకి చక్ర వడ్డీ వేసి తీసుకున్న అప్పు కంటే రెట్టింపు మొత్తాన్ని వసూలు చేస్తూ మనుషుల ప్రాణాలను పీక్కుతుంటున్నారు. పొరపాటున అప్పులు చెల్లించడంలో ఆలస్యమైందా ఇక అంతే పని.. లోన్‌ తీసుకున్న వారి కుటుంబసభ్యులకు, స్నేహితులకు మార్ఫింగ్‌ ఫొటోలు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ టార్చర్‌ పెడుతుంటారు. ఈ టార్చర్‌ భరించలేక ఆత్మహత్య చేసుకున్న వారు ఎంతో మంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో లోన్‌ యాప్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. తీసుకున్న అప్పును చెల్లించలేక, యాప్‌ నిర్వాహకుల టార్చర్‌ భరించలేక ప్రాణాలు తీసుకున్న వారు ఎమంతో మంది. తాజాగా ఇలాంటి ఓ హృదయవిదారకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో శనివారం చోటు చేసుకుంది. లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక వీరేంద్ర అనే బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. వివరాల్లోకి వెళితే.. నంద్యాలలోని బాలాజి కాంప్లెక్స్‌లో నివాసం ఉండే వీరేంద్ర బెంగళూరులో ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ సెకండ్ ఇయర్‌ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యాప్‌ నుంచి లోన్‌ తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో నిర్వాహకులు టార్చర్ పెట్టడం ప్రారంభించారు. తీసుకున్న అప్పు చెల్లించాలి అంటూ బంధువులకు ఫ్రెండ్స్ కు యాప్ నుంచి ఫోన్ కాల్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

 

అంతటితో ఆగకుండా వీరేంద్ర ఫొటోను మార్ఫింగ్ చేసి.. ‘ఈ వ్యక్తి మా సంస్థలో లోన్‌ తీసుకొని చెల్లించలేదు. మీ నెంబర్‌ను రిఫరెన్స్‌గా ఇచ్చాడు. ఇప్పుడు మీరు లోన్‌ను తిరిగి చెల్లించాలి. లేదంటే మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తాము’ అంటూ వీరేంద్ర స్నేహితులకు మెసేజ్‌లు పంపించారు. దీంతో అవమానంగా భావించిన వీరేంద్ర.. శనివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాప్‌ వేధింపుల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..