Blackmail: మాజీ ప్రియురాలి ప్రయివేటు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన ఘనుడు..ఎక్కడంటే..!

|

Apr 08, 2021 | 2:02 PM

అప్పులు ఎక్కువ చేశాడు. తీర్చాలంటే సొమ్ములు కావాలి. అప్పులు తీర్చమంటూ అప్పులోళ్ల వేధింపులు పెరిగాయి. అంతే.. మాస్టర్ ప్లాన్ వేశాడు.. పోలీసులకు చిక్కాడు. ఇంతకీ మనోడు చేసిన పనేంటో తెలుసా?

Blackmail: మాజీ ప్రియురాలి ప్రయివేటు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన ఘనుడు..ఎక్కడంటే..!
Blackmail
Follow us on

Blackmail:  అప్పులు ఎక్కువ చేశాడు. తీర్చాలంటే సొమ్ములు కావాలి. అప్పులు తీర్చమంటూ అప్పులోళ్ల వేధింపులు పెరిగాయి. అంతే.. మాస్టర్ ప్లాన్ వేశాడు.. పోలీసులకు చిక్కాడు. ఇంతకీ మనోడు చేసిన పనేంటో తెలుసా?

ఢిల్లీలో జరిగింది ఈ సంఘటన. ఒక మహిళ తన ఫేస్ బుక్ ఎకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని సీమాపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన ప్రయివేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఉంచుతానని బెదిరించి ఒక వ్యక్తి తన నుంచి డబ్బులు గుంజాడనీ.. మళ్ళీ మళ్ళీ వేధిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

మాజీ ప్రియుడే..

విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆ మహిళను వేధిస్తున్నది ఆమే మాజీ ప్రియుడే. అతని పేరు శుభం శర్మ గా గుర్తించారు పోలీసులు.

కొత్త నెంబరుతో బెదిరింపులు..

శర్మ తెలివిగా కొత్త నెంబర్లతో తన మాజీ ప్రియురాలిని వేధించాడు. మొదట తన ఫోన్ తో ఆమె ఫేస్ బుక్ ఎకౌంట్ హ్యాక్ చేశాడు. తరువాత ఆమెకు కాల్ చేశాడు. తనకు 15 వేలు ఇవ్వకపోతే ఆమె ప్రయివేట్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆ మహిళ అతనికి సొమ్ము సమర్పించుకుంది. మళ్ళీ కొన్నిరోజుల తరువాత ఇలాగే ఫోన్ చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

సోషల్ మీడియాలో శర్మ ఉంచిన పోస్టుల ద్వారా ఐపీ ఎడ్రస్ లను ట్రేస్ చేసిన పోలీసులు వోడా ఫోన్ నుంచి ఇవన్నీ చేస్తున్నట్టు గుర్తించారు. అయితే, ఫేక్ ఐడీలతో ఫోన్ ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు శుభం శర్మ ఇదంతా చేస్తున్నట్టు ఆధారాలు దొరికాయి. దీంతో శర్మను అదపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్ లో విచారిస్తున్నారు.

Also Read: Karimnagar: కరీంనగర్ జిల్లా మత్స్యశాఖలో అవినీతి భాగోతం.. మహిళా సొసైటీ ఏర్పాటు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

Narendra Modi: నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. కోవిడ్‌ పరిస్థితులపై కీలక నిర్ణయాలు..!