బైక్ రేసుల్లో రెచ్చిపోతున్న యువత.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న స్టంట్స్

| Edited By:

Jun 25, 2019 | 1:28 PM

థ్రిల్ కోసం ఎంతకైనా సై అంటున్నారు యూత్. థ్రిల్ కోసం గేమ్స్ ఆడుతూ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. నూరేళ్లు నిండకుండానే అర్థంతరంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్‌కే పరిమితమైన బైక్ రేస్ విశాఖకు పాకింది. వీకెండ్‌లో యువత చేసే స్టంట్స్.. వారి ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలను కూడా రిస్క్‌లో పడేస్తున్నాయి. ఆర్కే బీచ్, ఓజోన్ వ్యాలీ, ఐటీ సెజ్‌లు కుర్రాళ్ల బైక్ రేసులకు వేదికగా మారుతున్నాయి. ఇక్కడ విశాలమైన రోడ్లు […]

బైక్ రేసుల్లో రెచ్చిపోతున్న యువత.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న స్టంట్స్
Follow us on

థ్రిల్ కోసం ఎంతకైనా సై అంటున్నారు యూత్. థ్రిల్ కోసం గేమ్స్ ఆడుతూ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. నూరేళ్లు నిండకుండానే అర్థంతరంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్‌కే పరిమితమైన బైక్ రేస్ విశాఖకు పాకింది. వీకెండ్‌లో యువత చేసే స్టంట్స్.. వారి ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలను కూడా రిస్క్‌లో పడేస్తున్నాయి. ఆర్కే బీచ్, ఓజోన్ వ్యాలీ, ఐటీ సెజ్‌లు కుర్రాళ్ల బైక్ రేసులకు వేదికగా మారుతున్నాయి. ఇక్కడ విశాలమైన రోడ్లు ఉండటంతో యువత పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నారు. చీకటి పడితే చాలు.. కుర్రాళ్ల డార్క్ డ్రైవింగ్ స్టార్ట్ అవుతుంది. స్పోర్ట్స్ బైకులపై ఓవర్ స్పీడ్‌తో రోడ్డుపై వెళ్లేవారిని భయపెడుతున్నారు.

కొందరు సరదా కోసం చేస్తుంటే.. మరికొందరు బెట్టింగ్‌ల కోసం బరితెగిస్తున్నారు. మరికొందరు అమ్మాయిల ముందు బిల్డప్ కోసం చేస్తున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ స్టూడెంట్స్ గ్రూపులుగా ఏర్పడి బైక్ రేసుల్లో పాల్గొంటున్నారు. సింగిల్ టైర్ రైడ్, సైడ్ హ్యాంగింగ్ రైడ్, జిగ్ జాగ్, స్నేక్ రైడ్ ఇలా రకరకాల డేంజర్ స్టంట్‌లతో రేసుల్లో పాల్గొంటున్నారు. 360 డిగ్రీస్, 120 యాంగిల్, ఫ్రంట్ లీ, బ్యాక్ లీ.. పేర్లతో పిలిచే ఈ స్టంట్స్ పై యువత క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా ఇద్దరు యువకులు జిగ్ జాగ్ డ్రైవింగ్‌తో ప్రాణాలు కోల్పోయారు. నయ్ వర్మ, జెన్నీ అనే ఇద్దరు యువకులు జగదాంబ సెంటర్ నుంచి బీచ్ రోడ్‌కు వెళుతున్న సమయంలో వారి బైక్ అదుపు తప్పింది. ఓవర్ స్పీడ్‌ను కంట్రోల్ చేయలేక బైక్ డివైండర్‌ను ఢీ కొట్టి స్పాట్‌లోనే చనిపోయారు. ఇలాంటి ప్రమాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయని పోలీసులు చెబుతున్నారు.

బైక్ రేసర్లకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న సెక్షన్లను కాకుండా.. మరింత కఠినమైన చట్టాలు తెచ్చేందుకు యోచిస్తున్నారు. ఎవరైనా హద్దుమీరి రేసుల్లో పాల్గొంటే.. వారికి శిక్షణతోపాటు లైసెన్స్ కూడా రద్దు చేసే చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రత్యేకమైన యాప్‌ను సిద్దం చేస్తున్నారు. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.