Hooch Tragedy: కల్తీసారా ఘటనలో ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పు.. 9 మందికి మరణ శిక్ష.. మరికొంత మందికి..

|

Mar 05, 2021 | 5:25 PM

Gopalganj Hooch tragedy case: కల్తీ సారా విషాదం కేసులో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2016 లో బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో జ‌రిగిన నాటు సారా విషాదం కేసులో తొమ్మిది మందికి మ‌ర‌ణ‌శిక్ష‌ విధిస్తూ ధర్మాసనం..

Hooch Tragedy: కల్తీసారా ఘటనలో ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పు.. 9 మందికి మరణ శిక్ష.. మరికొంత మందికి..
Follow us on

Gopalganj Hooch tragedy case: కల్తీ సారా విషాదం కేసులో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2016 లో బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో జ‌రిగిన నాటు సారా విషాదం కేసులో తొమ్మిది మందికి మ‌ర‌ణ‌శిక్ష‌ విధిస్తూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. దీంతోపాటు ఈ కేసులో మ‌రో న‌లుగురు మ‌హిళా నిందితుల‌కు యావ‌జ్జీవ కారాగా శిక్ష‌ను ఖ‌రారు చేసింది. జీవితకాల శిక్ష ప‌డిన మ‌హిళ‌ల‌కు ప‌ది ల‌క్ష‌ల జ‌రిమానాను కూడా విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. 2016లో జ‌రిగిన నాటుసారా విషాద ఘ‌ట‌న‌లో 21 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. చాలామంది కంటిచూపును కోల్పోయారు.

ఈ కేసుపై అప్పటినుంచి కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ ఇచ్చిన తీర్పులో 13 మందిని దోషులుగా తేల్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన 9 మంది ఒకే కుటుంబానికి చెందిన‌వారు కావ‌డం విశేషం. 2016 ఆగ‌స్టులో గోపాల్‌గంజ్ జిల్లాలోని ఖ‌ర్జుర్‌బానీ ప్రాంతంలో నాటు సారా తాగిన ఘ‌ట‌న‌లో 21 మంది ప్రాణాలుకోల్పోగా.. కొందరు కంటి చూపు కోల్పోయారు. ఇదే కేసులో అప్పుడు పోలీసుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకున్నారు. 21 మంది పోలీసులను విధుల నుంచి తొలగించారు. వారిలో ముగ్గురు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు కూడా ఉన్నారు.

Also Read:

Bolivia Students Fall: ప్రాణం మీదకు తెచ్చిన తొందరపాటు.. నాలుగో అంతస్తు నుంచి కిందపడిన విద్యార్థులు

Araku Bus Accident: అరకు బస్‌ ప్రమాదంలో నిగ్గు తేలిన నిజాలు.. తీగలాగితే దిమ్మతిరిగే వాస్తవాలు..