Man Attacked a Traffic Policeman: కొంతమంది క్షణికావేశంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పోరపాట్లు చేయడమే కాకుండా.. ప్రశ్నించిన వారిపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి నడిరోడ్డుపై రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై బండిని పార్క్ చేసి.. ట్రాఫిక్ పోలీస్‌పైనే దాడికి పాల్పడ్డాడు. మొదట బైక్ తీయాలని ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించగా.. తననే ప్రశ్నిస్తావా..? అంటూ అతనిపైనే దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై తన బైక్ పార్క్ చేయగా.. అక్కడి నుంచి తీయాలని ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించాడు.. దీంతో ఆ వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ పైనే తిరగబడి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని జెహనాబాద్‌లో జరిగింది.
Bihar: A man attacked a traffic policeman after being asked to remove his bike that he had parked in the middle of a road in Jehanabad, police say.
“After attacking, he ran away but left the bike on the spot. A case will be registered against him,” says Traffic In-Charge AR Rai pic.twitter.com/Yw1jW4qJkL
— ANI (@ANI) October 1, 2021
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెహనాబాద్‌లోని ఓ రోడ్డు మార్గంలో శుక్రవారం ఓ వ్యక్తి బైక్‌పై వచ్చాడు. ఉన్నట్టుండి బైక్‌ను నడిరోడ్డుపై పార్కింగ్ చేశాడు. ఈ క్రమంలో అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. ట్రాఫిక్ జామ్ అవుతుందని… బండిని రోడ్డు నుంచి పక్కకు తీయాలని సూచించాడు. దీంతో సదరు వ్యక్తి బైక్ తీయకుండా.. ట్రాఫిక్ పోలీస్‌పై తిరగబడ్డాడు. కానిస్టేబుల్‌ను కిందపడేసి దారుణంగా కొట్టాడు. అనంతరం బైక్ అక్కడే వదిలేసి పరారైనట్లు ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఏఆర్ రాయ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తి ఎటువైపు వెళ్లాడో పరిశీలిస్తున్నారని రాయ్ వెల్లడించారు.
Also Read: