Inter-state Thieves Gang Arrest: బెంగళూర్‌లో 90 లక్షలు లూటీ చేసి బెంగాల్‌కు పారిపోతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజు పల్లి చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి రూ. 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గండ్రాజ్‌పల్లి చెక్‌పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు ఈ ఇద్దరు ఘరానా దొంగలను బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారులో రెండు బ్యాగుల్లో నోట్ల కట్టలు గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుబంకర్ షిల్, రాజు దేవనాథ్ లను అరెస్టు చేశారు.
ఈ నెల 2న బెంగళూరులోని ఎం హెచ్ ఆర్ లేవుట్‌లోని ఒక ఇంట్లో చోరీ చేసిన సొమ్ముగా గుర్తించారు. ఎంహెచ్‌ఆర్ లేఅవుట్ లోని రిటైర్డ్ ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎర్రయ్య ఇంట్లో దొంగతనం చేసింది ఈ ముఠా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి వెనుక డోర్ పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. తరువాత లాకర్‌లో ఉన్న 90 లక్షల నగదును లూటీ చేశారు. లూటీ చేసిన సొమ్ముతో స్వస్థలం పశ్చిమబెంగాల్‌కు పారిపోయే ప్రయత్నంలో ఉండగా పట్టుబడ్డారు.
సుబంకర్ షిల్, రాజు దేవనాథ్ బెంగళూర్‌లో సెంట్రింగ్ పనులు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. పగటిపూట సెంట్రింగ్ పనిచేయడం .. రాత్రివేళ ఇళ్లకు కన్నాలు వేయడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని వెల్లడించారు. పగటిపూట ఇళ్లను రెక్కీ చేసిన తరువాత రాత్రి వేళల్లో లూటీ చేస్తారని పోలీసులు తెలిపారు. ఎర్రయ్య ఇంట్లో దొంగతనం చేసిన సొమ్ముతో కారులో పారిపోవడానికి ఇద్దరు దొంగలు ప్లాన్ వేశారు 40 వేలకు స్విఫ్ట్ డిజైర్ కారును అద్దెకు మాట్లాడుకొని పయనం అయ్యారు. అయితే, చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాలతో లాక్‌డౌన్ కారణంగా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు ఈ కారును అపారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా దోపిడీ సొత్తు బయటపడింది. ఈవిషయాన్ని బెంగళూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దొంగలిద్దరిని రిమాండ్‌కు తరలించారు.
Read Also… ఢిల్లీ స్టేడియం వద్ద ఘర్షణ, రెజ్లర్ మృతి, ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పై ‘అనుమానపు నీలినీడలు’