Telangana: రోడ్డు పక్కన గుర్తు తెలియని ఆడశిశువు.. ఆదుకునేందుకు ముందుకొచ్చిన మహిళ.. అంతలోనే

|

Aug 29, 2022 | 8:50 AM

రోజులు మారుతున్నా, అన్ని రంగాల్లో సమాజం అభివృద్ధి చెందుతున్నా ఆడపిల్లలపై వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ వివక్షతను రూపుమాపేందుకు ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అవి ఏ మాత్రం ప్రయోజనం..

Telangana: రోడ్డు పక్కన గుర్తు తెలియని ఆడశిశువు.. ఆదుకునేందుకు ముందుకొచ్చిన మహిళ.. అంతలోనే
child girl
Follow us on

రోజులు మారుతున్నా, అన్ని రంగాల్లో సమాజం అభివృద్ధి చెందుతున్నా ఆడపిల్లలపై వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ వివక్షతను రూపుమాపేందుకు ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అవి ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేకపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అంతగా లేనప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా ఉంది. నిరక్షరాస్యత, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, ఆడపిల్లను పెంచడం భారమనో, కుమారుడు జన్మించలేదనో కారణమేదైనప్పటికీ పలువురు ఘోరాలకు పాల్పడుతున్నారు. కడుపున పుట్టిన బిడ్డను వదిలించుకుంటున్నారు. తల్లి పొత్తిళ్లలో సేద తీరాల్సిన చిన్నారులు ముళ్ల కంపలు, మురుగు కాలువలకు చేరువవుతున్నారు. తాజాగా జనగామ (Janagaon) జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లి లో గుర్తు తెలియని ఆడశిశువు లభ్యమైంది. బస్టాండు సమీపంలోని ముళ్ల పొదల్లో చిన్నారి ఏడుపులు విన్న స్థానికులు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. శిశువును గుర్తించిన స్థానికుల్లో ఒకరు చిన్నారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. శిశువు అనారోగ్యంతో ఉన్నా తాను పెంచుకుంటానంటూ ఆపన్న హస్తం అందించారు.

అయితే శిశువు తలపై కణతి ఉండటంతోపాటు అనారోగ్యంతో బాధపడుతోందన్న కారణంతో వదిలేసి వెళ్లి ఉంటారని చర్చించుకుంటున్నారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అంగన్ వాడీ ఉపాధ్యాయినులు, శిశు సంరక్షణ అధికారులు చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. చికిత్స అందించేందుకు హైదరాబాద్‌ లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మాతృత్వం అందినట్టే అంది, దూరమవడంతో ఆ మహిళ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి