మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మహిళా కార్పొరేటర్‌పై దాడి చేసిన మీర్‌పేట కార్పొరేటర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కార్పొరేటర్‌తోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12వ తేదీన ఉదయం 11.30 గంటలకు మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు స్థానిక విద్యావాణి స్కూల్‌లో హాజరయ్యారు. 13వ తేదీన నిర్వహించనున్న జనరల్ బాడీ మీటింగ్ ఎజెండా గురించి చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే పదో డివిజన్ కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ సమావేశానికి తన అనుచరులతో వచ్చి టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిళ్లు విసిరికొట్టాడు. సమావేశంలో ఉన్న కార్పొరేటర్ జిల్లా విజయ్‌కుమార్, జిల్లా సౌందర్యపై వాటర్ బాటిల్ విసిరేసాడు. అంతటితో ఆగకుండా ఫర్నీచర్‌ను ధ్వంసం దీంతో కార్పొరేటర్ జిల్లా సౌందర్య మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు కార్పొరేటర్ ముద్ద పవన్‌కుమార్, సయిద్ ఆరిఫ్ పాషా, శేషు భట్కర్‌అనిల్‌కుమార్, ఆలూరి వికాస్ వర్మ, వేముల విజయ్‌ను అరెస్టు చేసిరిమాండ్‌కు తరలించారు. అయితే వీరిపై 599/2021, U/ 147, 148, 354, 324, 504, 506, 427 R/W 149 IPC సెక్షన్ 3 (1) (R) (S), 3 (1) (W) (I), అలాగే SEC 3 (2) (V) (ఎ) ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.