Vasireddy Padma: అత్యాచార ఘటనపై స్పందించిన వాసిరెడ్డి పద్మ.. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం..

గుంటూరు జిల్లాలో లైంగిక దాడులపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు...

Vasireddy Padma: అత్యాచార ఘటనపై స్పందించిన వాసిరెడ్డి పద్మ.. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం..
Padma

Updated on: Oct 25, 2021 | 2:23 PM

గుంటూరు జిల్లాలో లైంగిక దాడులపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సత్తెనపల్లి కీచక టీచర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లుట్లలో బాలింతపై వాలంటీర్ అత్యాచారయత్నంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మానసిక వికలాంగురాలిపై ఓ కామోన్మా ది అత్యాచారం చేశాడు. తన భార్య సహకారంతోనే ఈ వ్యవహారం సాగించాడు.

బాధితురాలు గర్భం దాల్చటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గుంటూరు రాజీవ్‌గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక మానసిక దివ్యాంగురాలు. ఆమె తాతకు స్నేహితుడైన చిట్టిబాబు బాలిక ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో చిట్టిబాబు భార్య ఇంటికి వచ్చి బాలికకు జడ వేస్తానని తీసుకెళ్లి ఆమెను తన భర్తను గదిలోకి పంపి బయట కాపలా ఉండేదని విచారణలో తేలింది. ఈ విధంగా చిట్టిబాబు అనేకసార్లు బాలికపై అత్యాచారం చేశాడు. చిట్టిబాబు, అతని భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also..Vasireddy Padma: మహిళా పక్షపాతి అయిన సీఎం వైయ‌స్‌ జగన్‌ను విమర్శిస్తే సహించేది లేదు: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్

 

Follow Us