
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై మరో హింసాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. దీపు చంద్ర దాస్ తర్వాత ఒక గుంపు ఇప్పుడు అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్‌ను కొట్టి చంపింది. అమృత్ వయసు 29 సంవత్సరాలు. ఈ సంఘటన రాజ్‌బరి జిల్లాలో జరిగింది. పాంగ్షా మోడల్ పోలీస్ స్టేషన్ ఈ సంఘటనను ధృవీకరించింది. స్థానిక నివాసితులు అమృత్ మండల్‌ను దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారని, ఇది ఈ ఘటన హింసగా మారిందని పోలీసులు తెలిపారు.
పోలీసు రికార్డుల ప్రకారం.. అమృత్ మండల్ “సామ్రాట్ వాహిని” అనే స్థానిక ముఠాకు నాయకుడిగా ఉన్నాడు. మంగళవారం, చిట్టగాంగ్ సమీపంలోని రౌజన్ ప్రాంతంలో ఒక హిందూ కుటుంబం ఇల్లు తగలబడింది. ఐదు రోజుల్లో రౌజన్ ప్రాంతంలో ఏడు హిందూ కుటుంబాల ఇళ్ళు తగలబెట్టారు. పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు.
గత వారం కూడా ఒక హత్య:
గత వారం మైమెన్సింగ్ నగరంలో ఒక గ్రూపు 28 ఏళ్ల హిందూ ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్ర దాస్‌ను దైవదూషణ ఆరోపణతో కొట్టి చంపింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. మృతుడి భార్య, చిన్న పిల్లలు, తల్లిదండ్రులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి