Joker Malware: కరోనా సంక్షోభ సమయంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆండ్రాయిడ్ డివైజ్‌లను లక్ష్యంగా చేసుకొని జోకర్ మాల్వేర్ దాడి చేస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఇప్పటికే ఈ మాల్వేర్ ద్వారా ఎంతో మంది యువత మోసపోయారు. ఈ మాల్వేర్‌తో యూజర్‌కు సంబంధించి బ్యాంకింగ్ వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారం కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మాల్వేర్‌కు సంబంధించి మోసాలు పెరుగుతోన్న నేపథ్యంలో పోలీసులు నెటిజన్లను అలర్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జోకర్ మాల్వేర్‌కు సంబంధించిన లింక్‌లను క్లిక్ చేయవద్దని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ జోకర్ మాల్వేర్ మొదటిసారి 2017లో గూగుల్‌లో దర్శనమిచ్చింది. దీంతో అప్రమత్తమైన గూగుల్ కొన్ని అనుమానాస్పద యాప్‌లను తొలగించింది. అయితే ఈ మాల్‌వేర్ పూర్తిగా తొలిగిపోలేదు. తాజాగా మళ్లీ ఈ మాల్వేర్‌కు సంబంధించిన కేసులు నమోదవుతుండడంతో పోలీసులు అలర్ట్ చేశారు.
* జోకర్ మాల్వేర్‌కు అడ్డుకట్టవేయడానికి అవసరం లేని యాప్‌లకు ఎస్ఎమ్మెస్ యాక్సెస్‌ను తొలగించాలి.
* ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను, నెట్‌బ్యాంకింగ్ సమాచారాన్ని ఫోన్‌లో స్టోర్ చేసుకోకూడదు.
* అనవసరమైన యాప్‌లను అన్ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* ప్లేస్టోర్‌లో ఉన్నా సరే అనుమానం ఉంటే యాప్ జోలికి పోకపోవడమే మంచిది.
* క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివరాలు, ఫొటోలు, ఫోన్‌లో లేకుండా చేసుకోవాలి.
* నాణ్యమైన యాంటీ వైరస్‌ను ఉపయోగించాలి.
Also Read: Natural Cooling: ఏసీలు అక్కర్లేదట.. ఇంటిపై ఈ కాగితం పరిచితే చాలు పది డిగ్రీలు వేడి తగ్గిపోతుంది!
Research on Bats: మన దగ్గరా గబ్బిలాల పై పరిశోధన..ఎప్పటినుంచి..ఎక్కడో.. ఎందుకో తెలుసా?