ఆమెలో మగాడు..అమ్మో! ఎన్నో ఘోరాలు

| Edited By:

Nov 11, 2019 | 6:10 AM

ఇప్పుడు మేము చెప్పబోయే సంఘటన క్రైమ్‌లో కొత్త తరహాది. ఇదివరకు ఎప్పుడూ చూడనది..విననిది కూడా అయ్యిండొచ్చు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. బయటికి సాధారణ గృహిణిలాగే కనిపించే..ఓ మహిళ ఖాకీలు కూడా నివ్వెరపోయేలా కొన్ని క్రైమ్స్ చేసి..ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. ఇంతకీ ఎవరా మహిళ..? ఆమె చేసిన ఘోరాలు ఏంటి..?  ఈ స్టోరీలో చూద్దాం. హీ మ్యాన్..ఈ మాట అందరికి తెలుసు. కానీ తాజాగా షీ..మ్యాన్ అనే కొత్త పదం ఇప్పుడు […]

ఆమెలో మగాడు..అమ్మో! ఎన్నో ఘోరాలు
Follow us on

ఇప్పుడు మేము చెప్పబోయే సంఘటన క్రైమ్‌లో కొత్త తరహాది. ఇదివరకు ఎప్పుడూ చూడనది..విననిది కూడా అయ్యిండొచ్చు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. బయటికి సాధారణ గృహిణిలాగే కనిపించే..ఓ మహిళ ఖాకీలు కూడా నివ్వెరపోయేలా కొన్ని క్రైమ్స్ చేసి..ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. ఇంతకీ ఎవరా మహిళ..? ఆమె చేసిన ఘోరాలు ఏంటి..?  ఈ స్టోరీలో చూద్దాం.

హీ మ్యాన్..ఈ మాట అందరికి తెలుసు. కానీ తాజాగా షీ..మ్యాన్ అనే కొత్త పదం ఇప్పుడు పోలీసు రికార్డుల్లో చేరింది. అందుకు కర్త, కర్మ, క్రియ సాయితేజరెడ్డి. అలియాస్ సుమలత. పేరు మేల్..కానీ ఆ నేమ్ పెట్టుకున్న శాల్తీ మాత్రం ఫిమేల్. ఓ బాలిక స్పందన కాల్ సెంటర్‌కి ఇచ్చిన పిర్యాదుతో..కూపీ లాగితే..ఆమెలోని అతి గుబుస్సాకర.. అతడి కోణం బయటకు వచ్చింది.

చూడ్డానికి సుమలత చాలా బాగుంటుంది. ఎంతో సాంప్రదాయబద్దంగా కనిపిస్తుంది. చీరకట్టులో ఆమెను చూస్తుంటే..రెండు కళ్లు సరిపోవు. ఇదంతా బయట..కానీ ఆమెలో..కాదు..కాదు అతడిలో…అయ్యో..! ఆమెలో అతడు అనే మరో యాంగిల్ ఉంది. ఆమె పెద్దలు ఓ మంచి సంబంధం చూసి పెళ్లిచేశారు. కొంతకాలం బాగానే నడిచిన కాపురం..అమ్మడి ప్రవర్తనలో తేడాతో బ్రేక్ అయ్యింది. పదే, పదే అద్దం ముందు నిల్చోవడం..మగాడిలా జీన్స్, షర్ట్ వేసుకోవడం..లుంగీ కట్టుకోవడం..మగరాయుడిలా తనని తాను చూసి మురిపోవడంతో..కంగారుపడ్డ భర్త డివర్స్ తీసుకోని సైడైపొయ్యాడు. ఆ తర్వాత ఆమెలో.. అతడి లక్షణాలు మరింత ఎక్కువయ్యాయి. మగాళ్లతో ప్రెండ్షిప్ చెయ్యడం..బయటకూడా మగాళ్ల స్టైల్‌లోనే తిరగడం స్టార్ట్ చేసింది. ఆవిడలో ఈ ధోరణి ఎంత పెరిగిపోయిందంటే..సుమలత కాస్త సాయితేజరెడ్డిగా పేరు మార్చుకుంది. తనకు నచ్చిన అమ్మాయిలందరికి లవ్ లెటర్స్ రాయడం ప్రారంభించింది.

ఈలోపు ఏడుకొండలు అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోని ట్రావెల్ అయ్యారు. ఒంగోలులోని మారుతీనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం స్టార్ట్ చేశారు ఈ జంట. ఇక అదే ఏరియాలో నివశించే వంశీ వారికి బాగా క్లోజ్ అయ్యాడు. ఇక ముగ్గురి అండర్‌స్టాండింగ్ కూడా ఓ రేంజ్‌కి వెళ్లింది.

మహిళ అయి ఉండి సుమలత..అలియాస్ సాయితేజా రెడ్డి..అమ్మాయిలపై చేసిన అఘాయిత్యాలు అన్నీ, ఇన్నీ కాదు. వంశీ సిమ్ డిస్ట్రిబ్యూటర్ కావడంతో తన దగ్గర సిమ్ తీసుకున్న అమ్మాయిల నంబర్లను సుమలతకు ఇచ్చేవాడు. ఇక సుమలత చెలరేగిపోయేది. సదరు అమ్మాయిలకు ఫోన్ చేసి అబ్బాయిలా మాట్లాడేది. వారిని ట్రాప్ చేసి..ఇంటికి తీసుకొచ్చి మత్తమందు ఇచ్చి అసహజ శృంగారానికి పాల్పడేది. ఆ తర్వాత ఏడుకొండలు, వంశీ కూడా వారిపై లైంగిక దాడి చేసేవారు. ఆ టైంలో విజువల్స్ షూట్ చేసి ఎవరికైనా చెప్తే..వాటిని బయటపెడతామని చెప్పేవారు. కానీ వారి పాపం పండింది. వారి ట్రాప్‌లో పడ్డ  ఓ మైనర్ బాలిక స్పందన కార్యక్రమంలో విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది. ఇక అక్కడి నుంచి కిలాడీ ఆంటీ యవ్యారం బయటపడింది. పోలీసులు విచారణ సందర్బంగా..పరువు పోతుందేమో అన్న భయంతో ఏడుకొండలు ఆత్యహత్య చేసుకున్నాడు. సుమలతను, ఆమెకు హెల్ప్ చేసిన వంశీను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ఆదేశాలతో  రిమాండ్‌కు తరలించారు. విచారణ సమయంలో సుమలత ఇళ్లు తనిఖీ చెయ్యగా..అక్కడ లభించిన అసహజ శృంగార పరికరాలు చూసి ఖాకీలు షాక్ అయ్యారు.