Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురి పై కత్తితో దాడి చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కత్తి పోట్లకు గురైన నవ వధువు ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా నంద్యాల హరిజన పేటకు చెందిన మంజు, దేవ నగర్ కు చెందిన మళ్ళీశ్వరి ఇద్దరు ఒకరికొకరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం తమ ప్రేమ విషయాన్ని అమ్మాయి తండ్రి ఆంజనేయుల దృష్టికి తీసుకెళ్ళింది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మంజుకు ఇచ్చి వివాహం చేయ్యడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు ఆ తండ్రి. అంతే కాకుండా అమ్మాయి కి వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. దాంతో పది రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి ఇద్దరి ఇంటినుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వేరే ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు.
అయితే, తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న తన కూతురుపై పట్టలేని ఆగ్రహాన్ని పెంచుకున్నాడు తండ్రి ఆంజనేయులు. ఎలాగైన కూతురుని అంతమొందించాలని ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలోనే వారి ప్రేమ వివాహాన్ని అంగీకరించినట్లు వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అమ్మాయి, అబ్బాయిని మాట్లడాలి రా అంటూ ఇంటికి పిలిచాడు. మాటల మద్యలో తండ్రి ఒక్కసారిగా కన్న కూతురిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో నవ వధువు మల్లీశ్వరికి మెడకు, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మళ్ళీశ్వరిని భర్త మంజు నంద్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఈ దాడిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు. మళ్లీశ్వరిపై దాడి చేసిన ఆంజనేయులుని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Also read:
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో భయంకరమైన ఓపెనర్లు వీరే.. టాప్ 5లో ఈ బ్యాట్స్‌మెన్‌ని చూసి షాకవుతారంతే?
Telangana: ఆటో కిరాయి కోసం గొడవ.. పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్.. ఎక్కడ జరిగిందంటే..