అచ్చం సినిమాలో మాదిరి.. రూ. 2 కోసం మర్డర్..

|

Nov 11, 2019 | 5:24 AM

ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాను అందరూ చూసే ఉంటారు. అందులో 5 రూపాయల గురించి స్టార్టైన గొడవ..చిలికి చిలికి గాలివానగా మారి..రెండు ఊర్ల మధ్య ఫ్యాక్షన్‌గా టర్న్ అవుతోంది. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకుంటారు. సినిమాల్లోనే కాదు బయట కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయ్. తూర్పుగోదావరి జిల్లా వలసపాకలో ఇటువంటి దారుణమే చోటుచేసుకుంది. రూ. 2 గురించి స్టార్టైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసేవరకు […]

అచ్చం సినిమాలో మాదిరి.. రూ. 2 కోసం మర్డర్..
Follow us on

ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాను అందరూ చూసే ఉంటారు. అందులో 5 రూపాయల గురించి స్టార్టైన గొడవ..చిలికి చిలికి గాలివానగా మారి..రెండు ఊర్ల మధ్య ఫ్యాక్షన్‌గా టర్న్ అవుతోంది. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకుంటారు. సినిమాల్లోనే కాదు బయట కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయ్. తూర్పుగోదావరి జిల్లా వలసపాకలో ఇటువంటి దారుణమే చోటుచేసుకుంది. రూ. 2 గురించి స్టార్టైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసేవరకు వెళ్లింది.

వివరాల్లోకి వెళ్తే..రేవు సూర్య సువర్ణరాజు అనే వ్యక్తి తన సైకిల్ లో గాలిని నింపుకునేందుకు పిల్లి సాంబమూర్తి అనే వ్యక్తికి చెందిన  సైకిల్ రిపేర్ షాపుకు వచ్చాడు. గాలి పెట్టినందుకు రూ.2 ఇవ్వాలని సాంబ.. సువర్ణరాజుని అడిగాడు. నన్నే డబ్బులు అడుగుతావా అని సువర్ణ రాజు షాపు ఓనర్‌ను గద్దించాడు. ఇది కాస్తా ఇరువురి మధ్య  గొడవకు దారితీసింది. సువర్ణ రాజు కాస్త హద్దుమీరి సైకిల్ షాపు ఓనర్ సాంబను కొట్టాడు. ఇదంతా పక్కనే చూస్తూ ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు  ఆవేశంతో వచ్చి..సువర్ణ రాజుని రాడ్డుతో పొడిచాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే బాధితుడ్ని కాకినాడ గవర్నమెంట్ హాస్పటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ సువర్ణ రాజు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్వాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అప్పలరాజు పరారీలో ఉన్నాడు. ఇలా రెండు రూపాయల కోసం మొదలైన వాగ్వాదం ఒక మనిషి ప్రాణం తీసేవరకు వెళ్లింది.