Andhra Pradesh: కలలను మింగేసిన రాకాసి అలలు.. ఇటలీలో కర్నూలు విద్యార్థి దుర్మరణం..

Andhra Pradesh: ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లాడు, విద్యను పూర్తి చేసుకొని తిరిగి సొంతూరుకి వద్దామని ఎన్నో కలలు కంటోన్న సమయంలోనే ఓ కుర్రాడి జీవితం అద్యాంతరంగా ముగిసింది. వివరాల్లోకి వెళితే...

Andhra Pradesh: కలలను మింగేసిన రాకాసి అలలు.. ఇటలీలో కర్నూలు విద్యార్థి దుర్మరణం..

Updated on: Jun 12, 2022 | 10:08 AM

Andhra Pradesh: ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లాడు, విద్యను పూర్తి చేసుకొని తిరిగి సొంతూరుకి వద్దామని ఎన్నో కలలు కంటోన్న సమయంలోనే ఓ కుర్రాడి జీవితం అద్యాంతరంగా ముగిసింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు బాలాజీ నగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల పెద్ద కుమారుడు దిలీప్‌ ఏపీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తి చేశాడు. అనంతరం పై చదువుల కోసం ఇటలీ వెళ్లాడు. 2019లో మిలాన్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశాడు. దీంతో ఉద్యోగం రాగానే ఇండియాకు వచ్చి వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే శుక్రవారం ఇటలీలో ఉన్న మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లాడు. సాయంత్రం బీచ్‌లో గడుపుతోన్న సమయంలో ఒక్కసారిగా భారీ అలలు దిలీప్‌ను సముద్రంలోకి లాక్కెల్లాయి. అయితే అక్కడే ఉన్న కోస్ట్‌ గార్డ్‌లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు దిలీప్‌ మృతదేహం బయటపడింది. దిలీప్‌ మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత చదువు పూర్తి చేసుకున్న కుమారుడు మరికొన్ని రోజుల్లో ఇంటికి చేరుకుంటాడని ఆశతో ఉన్న దిలీప్‌ పేరెంట్స్‌ ఈ విషయం తెలియడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..