Tragedy: పెళ్లింట తీవ్ర విషాదం.. వివాహమైన కాసేపటికి వరుడి నానమ్మ మృతి.. అది తట్టుకోలేక ఏఎస్సై దుర్మరణం!

|

Nov 07, 2021 | 11:16 AM

అనంతపురం జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. అప్పటి వరకు అనందంగా గడిపిన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యంతో తల్లి చనిపోతే, అతి తట్టుకోలేక కొడుకు ప్రాణాలు కోల్పోయాడు.

Tragedy: పెళ్లింట తీవ్ర విషాదం.. వివాహమైన కాసేపటికి వరుడి నానమ్మ మృతి.. అది తట్టుకోలేక ఏఎస్సై దుర్మరణం!
Women Death
Follow us on

Andhra Pradesh Tragedy: అనంతపురం జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. అప్పటి వరకు అనందంగా గడిపిన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యంతో తల్లి చనిపోతే, అతి తట్టుకోలేక కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో శనివారం జరిగింది. కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీసుస్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. శనివారం కుమారుడు గోవర్ధన్‌ వివాహం నిర్వహించారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబం ఇంటి పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయింది.

అయితే, వరుడి నానమ్మ అయిన వెంకటస్వామి తల్లి కోన్నమ్మ(70) అనారోగ్యంతో అనంతపురంలోని ఓ వైద్యశాలలో చేరి మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. వివాహం పూర్తయిన కాసేపటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ వార్త విని ఆమె కుమారుడూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి ఆరోగ్యం గురించి దిగులుపడుతూనే ఆయన కుమారుడి వివాహాన్ని జరిపించారు. పెళ్లి తంతు ముగిసిన కాసేపటికే కోన్నమ్మ ఆసుపత్రిలో మరణించారు. విషయాన్ని బంధువులు ఫోన్‌లో వెంకటస్వామికి చెప్పడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆస్పత్రికి తరలించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also.. Crime News: గర్భిణిని వదిలిపెట్టి.. దీపావళి సంబరాల్లో మునిగారు.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి