కృష్ణ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం. నూజివీడు మండలం గొల్లపల్లిలో ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా నూజివీడు లయన్ తండాకు చెందినవారుగా గుర్తించారు. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చెరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
రెండు వందలు అడిగిన పాపానికి ఆటో డ్రైవర్ ఎంత దారుణంగా చంపిన వీడియో : Auto Driver Murder Video
జర్నలిస్టులపై దాడి అమానుషం.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు..