ఇంటి పైకప్పు కూలి న‌లుగురు మృతి

|

Aug 24, 2020 | 10:06 AM

రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్వార్ జిల్లాలోగ‌ల‌ కైమాలా గ్రామంలో ఇంటి పైకప్పు కూలి న‌లుగురు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో శిధిలాల కింద చిక్కుకున్న‌వారిని బయటకు తీసుకువ‌చ్చారు. వీరిలో న‌లుగురు మృతి చెంద‌గా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇంటి పైకప్పు కూలి న‌లుగురు మృతి
Follow us on

రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్వార్ జిల్లాలోగ‌ల‌ కైమాలా గ్రామంలో ఇంటి పైకప్పు కూలి న‌లుగురు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో శిధిలాల కింద చిక్కుకున్న‌వారిని బయటకు తీసుకువ‌చ్చారు. వీరిలో న‌లుగురు మృతి చెంద‌గా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలు తడిసిముద్దవుతున్నాయి. కైమాలా గ్రామంలో ఉంటున్న అలీముద్దీన్ కుటుంబ స‌భ్యులు నిద్ర‌పోతున్న సమయంలో అకస్మాత్తుగా ఇంటి పైకప్పు విరిగిప‌డింది. ఈ ప్ర‌మాదంలో అలీముద్దీన్‌తో పాటు అత‌ని ముగ్గురు పిల్లలు మృతిచెందారు. అలీముద్దీన్ భార్య తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెకు ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.