ఏపీలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య.. టిప్పర్‌తో గుద్ది.. వేటకొడవల్లతో నరికి చంపిన దుండగులు!

అనంతపురం జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుంతకల్లు రైల్వే వంతెన సమీపంలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆలూరు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన్ను లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపినట్టు తెలుస్తోంది.

ఏపీలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య.. టిప్పర్‌తో గుద్ది.. వేటకొడవల్లతో నరికి చంపిన దుండగులు!
Atp Murdered

Updated on: Apr 27, 2025 | 5:12 PM

అనంతపురం జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుంతకల్లు రైల్వే వంతెన సమీపంలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆలూరు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన్ను లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపినట్టు తెలుస్తోంది.

లక్ష్మీనారాయణ, అతని కుమారుడితో కలిసి ఇన్నోవా వాహనంలో గుంతకల్ నుండి చిప్పగిరికి వెళుతుండగా.. రైల్వే వంతెన సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు టిప్పర్ తో ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టి. తర్వాత కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణను వేట కొడవల్లతో నరికి చంపినట్టు తెలుస్తోంది. అయితే కారులో ఉన్న అతని కుమారుడిని మాత్రం దుండగులు ప్రాణాలతో వదిలేశారు. ఈ ప్రమాదంలో అతని కుమార్ వినోద్‌ కూడా తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రవేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…